డౌన్ టు ఎర్త్ పర్సన్.. ఆ మూడింటికి కేరాఫ్ అడ్రస్!
తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో SKN మాట్లాడుతూ.." రష్మిక ఎన్నో హిట్ సినిమాల్లో నటిచింది. పుష్ప, పుష్ప-2, యానిమల్, థామా ఆమె కెరీర్ కి ఉండదు కాదు .;
ఒక సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమాలో నటించే నటీనటులు, డైరెక్టర్, టెక్నీషియన్స్,మ్యూజిక్ ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో గొప్పగా చెబుతారు. అలా సినిమా కోసం వారు ఎంతలా కష్టపడ్డారు అనేది సినిమాకి సంబంధించిన ఈవెంట్ లలోనే బయటపడుతుంది. ఇప్పుడు తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ విడుదల కాబోతున్న నేపథ్యంలో రష్మిక మందన్నా గురించి గొప్పగా చెబుతూ స్టేజి మీదే పొగడ్తల వర్షం కురిపించారు నిర్మాత ఎస్కేఎన్..
తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా చిత్ర యూనిట్ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు. ఇందులో భాగంగా రష్మిక పనితనం ఎలా ఉంటుంది.. సినిమాల కోసం ఆమె ఎంతలా కష్టపడుతుంది? అనే విషయాల గురించి గొప్పగా చెప్పారు నిర్మాత ఎస్కేఎన్..
తాజాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో SKN మాట్లాడుతూ.." రష్మిక ఎన్నో హిట్ సినిమాల్లో నటిచింది. పుష్ప, పుష్ప-2, యానిమల్, థామా ఆమె కెరీర్ కి ఉండదు కామా . రష్మిక గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఇంతకుముందు నేను నిర్మాతగా చేసిన బేబీ మూవీ ఈవెంట్ కి వచ్చిన సమయంలో కూడా ఇదే విషయం చెప్పాను. ఇప్పుడు మళ్లీ అదే విషయం మరొకసారి రిపీట్ చేస్తున్నాను.. ఎందుకంటే కొంతమందిలో స్వీట్నెస్ ఉంటుంది.. కొంతమందిలో హాట్ నెస్ ఉంటుంది. కొంతమందిలో కూల్ నెస్ ఉంటుంది.ఇక మనం ఉదయాన్నే ఏబిసి జ్యూస్ తాగినట్టు అంటే క్యారెట్,ఆపిల్, బీట్రూట్ అన్ని కలిపి ఎలా అయితే తాగుతామో. స్వీట్నెస్, హార్ట్ నెస్, కూల్ నెస్ వీటన్నింటినీ మిక్సీలో వేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తీస్తే అది రష్మిక మందన్న.. మంచితనానికి, నిదానత్వానికి, గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ రష్మిక.
వీటన్నింటితో పాటు రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటారు. నేను ఇంత పెద్ద స్టార్ ని అనే పొగరు ఎక్కడా కూడా చూపించరు. ఆమె చాలా సింప్లిసిటీ గా ఉంటారు. పబ్లిసిటీని కోరుకోదు. రష్మిక ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటుంది. ఇక నేను ఇప్పటివరకు చూసిన హీరోయిన్లలో చాలామంది పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయారు. కానీ నేను చూసిన పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లలో రష్మికా అంత కమిట్మెంట్.. అంత డెడికేషన్ ఉండే హీరోయిన్లను నేనెప్పుడూ చూడలేదు".. అంటూ రష్మిక మీద స్టేజ్ పైనే పొగడ్తల వర్షం కురిపించారు నిర్మాత..
నిర్మాత ఎస్కేఎన్ రష్మికని పొగుడుతూ మాట్లాడినంతసేపు ఆడిటోరియం మొత్తం అరుపుల శబ్దంతో మార్మోగిపోయింది. ఎస్కేఎన్ మాట్లాడే మాటలకు రష్మిక తెగ సిగ్గుపడుతూ నవ్వుకుంది.. నిర్మాత ఎస్కేఎన్ చెప్పినట్లు రష్మిక నేషనల్ క్రష్ అనే గర్వం ఎక్కడా కూడా చూపించదు. బయట ఎక్కడ కెమెరాల కంటికి చిక్కినా కూడా చాలా హుందాగా నడుచుకుంటుంది. నేను ఒక పాన్ ఇండియా హీరోయిన్ ని అనే గర్వం ఎక్కడా చూపించదు..అలా ఎస్కేఎన్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది రష్మిక ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మీరు మాట్లాడింది 100% కరెక్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.