గ్లామర్‌కు కొత్త టచ్… ‘కాక్‌టెయిల్ 2’ ఈవెంట్‌లో రష్మిక లుక్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ తో కలిసి నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘కాక్‌టెయిల్ 2’.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్ తో కలిసి నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘కాక్‌టెయిల్ 2’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్మిక తన కో-స్టార్స్‌తో కలిసి దిగిన కొన్ని క్రేజీ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఆమె వేసుకున్న డ్రెస్, ఆ లుక్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ ముచ్చట్లేంటో మనమూ చూసేద్దాం..
కాక్‌టెయిల్ 2’ ప్రమోషన్స్‌లో రష్మిక హల్‌చల్:
తాజాగా జరిగిన ‘కాక్‌టెయిల్ 2’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న, షాహిద్ కపూర్ జంటగా సందడి చేశారు. ఈ ప్రమోషన్స్ సందర్భంగా దిగిన ఫోటోలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. "ఈ లవ్లీ, హ్యాపీ పీపుల్‌తో ఉంటే ఎప్పుడూ నవ్వులు, మస్తీనే! దియా, అలీ, కునాల్ జీవితాల్లోకి ఇదో చిన్న ఎంట్రీ.." అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో రష్మికతో పాటు షాహిద్ కపూర్ కూడా చాలా కూల్‌గా కనిపించాడు.
అదిరిపోయిన కార్పొరేట్-చిక్ అవుట్‌ఫిట్:
ఈ ఫోటో షూట్‌లో రష్మిక లుక్ చాలా డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా ఉంది. ఆమె ఒక మోడ్రన్ కార్పొరేట్-చిక్ అవతార్‌లో మెరిసిపోయింది. పెరివింకిల్ బ్లూ కలర్ స్లీవ్‌లెస్ బటన్-అప్ షర్ట్ వేసుకుని.. దానికి మ్యాచింగ్‌గా లైట్ గ్రే పిన్‌స్ట్రైప్ ఫ్యాబ్రిక్‌తో ఉన్న హై-వేస్టెడ్, వైడ్-లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ ధరించింది. ఇక వీటన్నిటికీ హైలైట్‌గా కాలర్ షర్ట్‌పై గ్రే పిన్‌స్ట్రైప్ టైని కూడా ముడి వేసుకుని పర్‌ఫెక్ట్ బాస్ లేడీలా కనిపించింది.
14 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్:
2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చిన ‘కాక్‌టెయిల్’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్, లవ్, బ్రేకప్ ఎమోషన్స్‌తో పాటు దీపికా యాక్టింగ్, పాటలు జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీ నుండి సీక్వెల్‌గా ‘కాక్‌టెయిల్ 2’ వస్తుండడంతో బాలీవుడ్‌లో గట్టి హైప్ క్రియేట్ అయింది.
సరికొత్త లవ్ ట్రయాంగిల్ కథ:
ఈ సీక్వెల్‌లో పాత నటీనటులు కాకుండా సరికొత్త కాస్టింగ్‌తో సినిమాను ప్లాన్ చేశారు. ఇందులో షాహిద్ కపూర్ 'కునాల్' పాత్రలో, రష్మిక మందన్న 'దియా' పాత్రలో మరియు కృతి సనన్ 'అలీ' పాత్రలో నటిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య నడిచే మోడ్రన్ లవ్ ట్రయాంగిల్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్న ట్రైలర్:
ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కానీ సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు ఈ కొత్త కాంబినేషన్ బాగుందంటుంటే.. మరికొందరు మాత్రం మొదటి భాగంతో పోలుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్‌లో కామెడీ పంచ్‌లు అంతగా పేలలేదని, రష్మిక, కృతిల యాక్టింగ్ ఓకేలా ఉందంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక కానీ అసలు రిజల్ట్ ఏంటో తెలియదు.
ట్రైలర్ టాక్ ఎలా ఉన్నా, ప్రమోషన్స్ లో రష్మిక మందన్న లుక్స్ మాత్రం ఫ్యాన్స్‌ను విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సౌత్‌లో మెరిసిన ఈ కన్నడ కస్తూరి, ఇప్పుడు హిందీలో కూడా వరుస సినిమాలతో క్రేజ్ సంపాదిస్తోంది. మరి జూన్ 19న రాబోతున్న ఈ ‘కాక్‌టెయిల్ 2’ సినిమాతో రష్మిక, షాహిద్ జంట బాలీవుడ్‌లో ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తుందో చూడాలి.