గ్లామర్ వర్కౌట్ కాలేదా.. బుకింగ్స్ ఎందుకింత డల్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్ 2 జూన్ 19న థియేటర్లలోకి వస్తోంది.

Update: 2026-06-17 06:05 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్ 2 జూన్ 19న థియేటర్లలోకి వస్తోంది. 2012లో వచ్చిన సూపర్ హిట్ కాక్టెయిల్ సినిమాకు సీక్వెల్ గా హోమి అదజానియా ఈ రొమాంటిక్ కామెడీని తెరకెక్కించారు. షాహిద్ కపూర్, కృతి సనన్ లతో పాటు రష్మిక ఇందులో మెయిన్ లీడ్ లో నటించింది. ఇక కాంబినేషన్ కు నార్త్ లో క్రేజ్ ఉన్నప్పటికీ ఇక్కడ సీన్ వేరేలా ఉంది.

ఈ సినిమాకు సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగిపోతోంది. హైదరాబాద్ లాంటి మెగా సిటీలోనే ఈ సినిమాకు టికెట్ సేల్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక్కో స్క్రీన్ కి కనీసం 10 నుంచి 15 టికెట్లు కూడా తెగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ, వైజాగ్ లాంటి మేజర్ సెంటర్స్ లో కూడా ఈ సినిమాను పట్టించుకునే జనమే కరువయ్యారు.

వైజాగ్ లో నార్త్ ఇండియన్ పబ్లిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా థియేటర్ల దగ్గర ఎలాంటి బజ్ కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చింది. రష్మిక, కృతి సనన్ ల గ్లామర్ షోతో పాటు లిప్ లాక్స్, డబుల్ మీనింగ్ లాంటి 18+ కంటెంట్ ఇందులో గట్టిగానే ఉంది. అసలైతే ఇలాంటి బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలకు యూత్ లో గట్టి క్రేజ్ ఉంటుంది. కానీ కాక్టెయిల్ 2 విషయంలో ఆ బోల్డ్ నెస్ ఏదీ ఆడియన్స్ ను థియేటర్లకు లాగలేకపోతోంది.

ఇక గ్లామర్ ఉంటే సరిపోదు సరైన రీచ్ కూడా ఉండాలని ఈ అర్ధమవుతుంది. ఈ రేంజ్ లో బుకింగ్స్ డ్రాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడమే. బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమాను సౌత్ మార్కెట్ లో ప్రమోట్ చేయడాన్ని చాలా లైట్ తీసుకున్నారు. రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నా కూడా మన దగ్గర కనీస స్థాయిలో ఈవెంట్స్ ప్లాన్ చేయలేదు. షాహిద్ కపూర్, రష్మిక కపుల్ గా నటిస్తున్న ఈ మోడరన్ లవ్ ట్రయాంగిల్ స్టోరీ గురించి చాలా మందికి ఇంకా క్లారిటీనే లేదు.

కనీసం సోషల్ మీడియాలో కూడా సరైన కంటెంట్ వదలకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇదే టైమ్ లో టాలీవుడ్ నుంచి సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా కూడా రిలీజ్ అవుతోంది. లోకల్ గా ఆ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు గట్టిగా ప్రమోషన్స్ జరగడం వల్ల జనాల ఫోకస్ మొత్తం ఆ సినిమా పైనే పడింది. ఇలాంటి టైమ్ లో ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వస్తున్న బాలీవుడ్ సినిమాలను మన లోకల్ ఆడియన్స్ అస్సలు ప్రిఫర్ చేయడం లేదు.

ఇక రష్మిక మందన్నకు తెలుగులో ఉన్న క్రేజ్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు. ఈ మోడరన్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే కంటెంట్ లో గట్టి దమ్ముండాలి. ఫస్ట్ డే మార్నింగ్ షోస్ పూర్తయ్యాక పబ్లిక్ నుంచి సూపర్ అనే పాజిటివ్ టాక్ వస్తేనే థియేటర్ కౌంటర్ల దగ్గర టికెట్ల సేల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పటివరకు ఈ సినిమాకు గడ్డు కాలమే అని చెప్పాలి.

Tags:    

Similar News