90 నిమిషాల్లోనే పెళ్లి కుమార్తెగా!

సాధారణంగా సినీ తారల వివాహం అంటే అదొక భారీ ఈవెంట్‌. ముఖ్యంగా పెళ్లి రోజున వధువు ముస్తాబు కావడానికి కనీసం నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంటుంది.;

Update: 2026-04-14 14:56 GMT

సాధారణంగా సినీ తారల వివాహం అంటే అదొక భారీ ఈవెంట్‌. ముఖ్యంగా పెళ్లి రోజున వధువు ముస్తాబు కావడానికి కనీసం నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంటుంది. మేకప్, హెయిర్ స్టైల్, చీర కట్టు.. ఇలా ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్‌గా ఉండాలని తారలు కోరుకుంటారు. కానీ నేషనల్ క్రష్ రష్మికా మందన్న మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె కేవలం 90 నిమిషాల్లోనే పెళ్లి కుమార్తెగా సిద్ధమవ్వడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆసక్తికర విషయాన్ని రష్మిక మేకప్ ఆర్టిస్ట్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రష్మిక తన వివాహ వేడుకలో సహజత్వానికే పెద్దపీట వేశారని పేర్కొన్నారు. భారీ బ్రైడల్ మేకప్, ముఖంపై మెరుపులు వంటి హడావిడి ఏమీ లేకుండా? అతి తక్కువ సమయంలోనే చాలా సింపుల్‌గా తయారవ్వాలని ఆమె ముందుగానే స్పష్టం చేశారు. ఈ నిర్ణయం మేకప్ బృందాన్ని సైతం విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే అంత తక్కువ సమయంలో ఒక స్టార్ హీరోయిన్‌ను పెళ్లి కూతురిగా సిద్ధం చేయడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. రష్మిక తన వెడ్డింగ్ లుక్ కోసం నో మేకప్ లేదా మినిమలిస్ట్ లుక్‌ను ఎంచుకున్నారు.

కేవలం గంటన్నర సమయంలోనే ఆమె తన మేకప్‌ను పూర్తి చేసి వేదికపైకి రావడానికి సిద్ధమయ్యారు. సెలబ్రిటీల ప్రపంచంలో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో గ్రాండ్‌గా ప్రదర్శించే తరుణంలో రష్మిక ఇంతటి నిరాడంబరతను చాటుకోవడం విశేషం. ఆమెకు తనపై ఉన్న ఆత్మవిశ్వాసం, సహజమైన అందం పట్ల ఆమెకున్న గౌరవం ఈ నిర్ణయంతో స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.విజయ్ దేవరకొండతో జరిగిన వివాహ వేడుకలో రష్మిక లుక్ గురించి చర్చ జ‌రిగిన‌ వేళ ఈ 90 నిమిషాల మేకప్ స్టోరీ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది.

వెండితెరపై భారీ మేకప్‌తో కనిపించే తారలు, తమ జీవితంలోని అతి ముఖ్యమైన రోజున మాత్రం సాధారణంగా ఉండాలని కోరుకోవడం ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది. గంటల కొద్దీ మేకప్ కుర్చీకే పరిమితం కాకుండా ఆ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఆ క్షణాలను ఆస్వాదించడానికి రష్మిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న చేసిన ఈ పని గ్లామర్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. అందం అంటే భారీ మేకప్ కాదని అది వ్యక్తిత్వంలో సహజత్వంలో ఉంటుందని ఆమె నిరూపించింది. అతి తక్కువ సమయంలోనే అతి సుందరమైన పెళ్లి కుమార్తెగా మెరిసిన రష్మిక భావి వధువులకు ఒక కొత్త స్ఫూర్తిని అందించారు. మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించిన ఈ రహస్యం రష్మికలోని సింప్లిసిటీని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది.

Tags:    

Similar News