మరోసారి కట్టిపడేసిన రష్మిక.. వాటిని హైలెట్ చేస్తూ!

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ తన సినీ కెరియర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగింది.;

Update: 2025-10-03 08:30 GMT

నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న మంచి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ తన సినీ కెరియర్ లో ఎంతో ఎత్తుకు ఎదిగింది. ప్రస్తుతం సౌత్, నార్త్ రెండు ఇండస్ట్రీలలో ఈ హీరోయిన్ చాలా బిజీగా ఉంది. దాదాపు తను ఇండస్ట్రీకి వచ్చిన ఈ దశాబ్ద కాలంలో తమిళ, కన్నడ,తెలుగు, హిందీ ఇలా నాలుగు భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తూ వస్తోంది . అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇప్పుడున్న పాన్ ఇండియా హీరోయిన్లలో చోటు సంపాదించుకుంది.పైగా అందరి హీరోయిన్ల కంటే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. గీత గోవిందం సినిమా నుండి మొదలు పుష్ప లోని శ్రీవల్లి, ఛావాలోని యేసు భాయి వంటి పాత్రలు ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.

కవర్ పేజ్ కోసం అద్భుతమైన స్టిల్స్..

అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాల్లో చేస్తూనే.. మరోవైపు వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ. కవర్ పేజీలకు స్టిల్స్ ఇస్తూ నెట్టింట్లో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తాజాగా రష్మిక మందన్నా హర్పర్స్ బజార్ ఇండియా కవర్ పేజ్ కి ఇచ్చిన ఫోటో స్టిల్స్.. అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ కవర్ పేజ్ కి ఇచ్చిన ఫోటోలలో అందమైన దుస్తులలో అచ్చం ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగే కనిపిస్తుంది.

స్పెషల్ అట్రాక్షన్ లో భాగమైన జువెలరీ..

ఆకులాంటి ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ లో అందంగా మెరుస్తోంది. అలాగే మెడలో వేసుకున్న గ్రాండ్ వింగ్డ్ డిజైన్ నెక్ లైన్ ఆమె అందానికి మరింత స్టైలిష్ లుక్ ని జోడించింది. రష్మిక వేసుకున్న డ్రెస్ బోల్డ్ గా, అందంగా ఉండడంతో పాటు ఆమె వేసుకున్న ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచుతున్నాయి. స్నేక్ డిజైన్ లో ఉండే వజ్రాల హారంతో పాటు చెవికి పెట్టుకున్న షార్ప్ చెవి కఫ్ లు చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అంతేకాదు చేతికి పెట్టుకున్న బ్రాస్లెట్ కూడా ఆమె స్టైల్ ని మరింత పెంచింది.

రష్మిక లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా..

ప్రస్తుతం రష్మిక కి సంబంధించిన ఈ లుక్ లో ఆమె ఆభరణాలే హైలైట్ అవుతున్నాయి. మరో ఫోటోలో బ్లోని అటెలియర్ తయారు చేసిన బస్టియర్ షార్ట్స్ ధరించింది. గూచీ బూట్లు, మిలీనియం నెక్లెస్ జెమా నెక్లెస్, స్వరోవ్స్కీ డిజైన్ చేసిన ఉంగరాన్ని పెట్టుకొని తన లుక్ ని కంప్లీట్ చేసింది. అలా అద్భుతమైన డ్రెస్సులు వేసుకోవడంతో పాటు వాటికి తగ్గట్లుగా ఉండే ఆభరణాలు పెట్టుకొని హర్పర్స్ బజార్ ఇండియా కవర్ పేజీకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన్నకి సంబంధించిన ఈ కవర్ పేజీ లుక్స్ సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాయి. రష్మిక లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

రష్మిక మందన్న సినిమాలు..

ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ లో షాహిద్ కపూర్, కృతి సనన్,రష్మిక మందన్నలు ప్రధాన పాత్రలో చేస్తున్న కాక్ టైల్ 2 షూటింగ్లో ఈ మధ్యనే పాల్గొంది. అలాగే టాలీవుడ్ లో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీలకి కూడా ఓకే చెబుతూ మైసా అనే సినిమాని కూడా ఈ మధ్యనే ప్రకటించింది. బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా తో థామా మూవీలో కూడా నటిస్తోంది. ఈ హీరోయిన్ నటించిన సినిమాలకు సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. అలా పుష్ప-3,యానిమల్ పార్క్ లో కూడా రష్మిక మందన్న నటిస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న AA22XA6 సినిమాలో కూడా కీరోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News