డీమన్ స్లేయర్ స్క్రీనింగ్ లో అతడితో సందడి చేసిన రష్మిక!

మొదటిసారిగా 2016లో కన్నడలో వచ్చిన 'కిర్రిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది రష్మిక మందన్న.;

Update: 2025-09-09 07:59 GMT

మొదటిసారిగా 2016లో కన్నడలో వచ్చిన 'కిర్రిక్ పార్టీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ వచ్చింది రష్మిక మందన్న. తన మొదటి సినిమానే మంచి విజయం అందుకోవడంతో తెలుగులో 'ఛలో' సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది. అలా 'గీతగోవిందం' సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన రష్మిక ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని అందుకొని.. ఇతర భాషలలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ప్రస్తుతంఒక్కో చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న రష్మిక.. నిరంతరం ఈవెంట్స్ కి హాజరవుతూ హైలెట్ అవుతూ ఉంటుంది.


ఈ క్రమంలోనే తాజాగా మరో ఈవెంట్లో ప్రముఖ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి సందడి చేసింది. విషయంలోకి వెళ్తే.. అనిమే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 'డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్' విడుదల కాబోతోంది.. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే ముంబైలో అనిమే అభిమానుల కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని క్రంచి రోల్ , సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా పెద్ద ఎత్తున ముంబైలో నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో కి రష్మికతో పాటుగా హీరో టైగర్ ష్రాఫ్ కూడా వచ్చి సందడి చేశారు.


రష్మిక.. టాంజీరో, నెజుకో అభిమానులకు ప్రేరణగా ఉండే విధంగా జపనీస్ డ్రస్సు లో కనిపించింది. అంతేకాదు అత్యుత్సాహం కనబరుస్తూ.. అక్కడ అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి కూడా అడిగి మరీ తెలుసుకుంది.దీంతో అక్కడ పెద్ద ఎత్తున సందడి నెలకొంది.. అదే సమయంలో టైగర్ ష్రాఫ్ కూడా తన లుక్ తో ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో తన ఫేవరెట్ సీన్ "జెనిట్సు కైగాకు"అని కూడా తెలిపారు


' అకాజా vs గియు అలాగే టాంజీరో' ఫైట్స్ సన్నివేశాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సుమారుగా మనదేశంలో కూడా 750 కి పైగా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అనిమే సినిమాకి ఇంతలా ఆదరణ దక్కడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. తెలుగు డబ్బింగ్ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి రష్మిక తో పాటు టైగర్ ష్రాఫ్ రావడం ఇక్కడ వైరల్ గా మారింది.

రష్మిక విషయానికి వస్తే.. ప్రస్తుతం రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో పాటు థామా అనే హారర్ మూవీలో కూడా నటిస్తోంది. అంతేకాదు కాంచన ఫ్రాంఛైజీ కాంచన 4లో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు ఇలాంటి చిత్రాల ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది రష్మిక మందన్న.

Tags:    

Similar News