గ్లామర్ ఎలివేషన్ కోణంలో స్వేచ్ఛ గురించి రాషా తడాని వ్యూ
సినీపరిశ్రమలో దశాబ్దాలుగా గ్లామర్ ప్రదర్శన అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఒకప్పుడు పాటలలో లేదా సన్నివేశాలలో కథానాయికల గ్లామర్‌ను కేవలం ఎంటర్‌టైనింగ్ అంశంగా మాత్రమే చూసేవారు.
సినీపరిశ్రమలో దశాబ్దాలుగా గ్లామర్ ప్రదర్శన అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఒకప్పుడు పాటలలో లేదా సన్నివేశాలలో కథానాయికల గ్లామర్‌ను కేవలం ఎంటర్‌టైనింగ్ అంశంగా మాత్రమే చూసేవారు. కానీ నేటి మోడ్రన్ సినిమాలో ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. గ్లామర్ ఉన్నా అది పాత్రకు అనుగుణంగా.. గౌరవప్రదమైన పరిధిలో ఉండాలని నేటి ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నటి రాషా తడాని ఈ అంశంపై స్పందిస్తూ... సినీ రంగంలో మహిళల పాత్రలు .. వారి సౌకర్యం ఎంత కీలకమో వివరించారు.
సినిమాల్లో గ్లామర్ ప్రదర్శన అనేది పరిమితులకు లోబడి ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారనే వాదనపై రాషా తడాని తనదైన శైలిలో స్పందించారు. ఒక పాత్రను లేదా పాటను చిత్రీకరించేటప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఆ పాత్ర చేసే నటి సౌకర్యం. పాత్ర డిమాండ్ చేసినంత మాత్రాన లేదా కథలో భాగమైనంత మాత్రాన కాకుండా... ఆ పని చేయడానికి ఆ మహిళ మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉందా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న అని రాషా స్పష్టం చేశారు.
ఏదైనా ఒక కఠినమైన లేదా విభిన్నమైన పాట చిత్రీకరణలో పాల్గొనేటప్పుడు ప్రారంభంలో సంకోచించడం సహజం. రాషా తడాని కూడా `ఉయి శమ్మా..` పాట చేసే సమయంలో తొలత కొంత సందేహించానని తెలిపారు. సినిమాలో తాను పోషించిన `జాన్కి` అనే విభిన్నమైన క్యారెక్టర్ ఒకవైపు ఉంటే... ఈ పాట శైలి పూర్తిగా భిన్నంగా ఉండటమే దానికి కారణం. అయితే వర్క్ స్పేస్‌లో సరైన వాతావరణం ఉన్నప్పుడు నటీనటులు తమ పరిధులను దాటి కొత్త తరహా ప్రయత్నాలు చేయగలరని ఈ సందర్భం నిరూపించిందని తెలిపారు.
నటీనటులకు సెట్‌లో లభించే గౌరవం - మద్దతు వారి నటనపై నేరుగా ప్రభావం చూపుతాయి. దర్శకుడు, కొరియోగ్రాఫర్, సెట్‌లోని తోటి కళాకారులు.. డ్యాన్సర్లు అందించే ప్రోత్సాహం.. పరస్పర గౌరవం వల్లనే తాను ఆ పాటను సౌకర్యవంతంగా పూర్తి చేయగలిగానని రాషా తెలిపారు. ఒక నటి సెట్‌లో సురక్షితంగా... గౌరవంగా భావించినప్పుడు మాత్రమే ఆ పాత్రకు లేదా సన్నివేశానికి సంపూర్ణ న్యాయం చేయగలదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాషా చెప్పిన దానిని బట్టి జాన్వీ కపూర్ కి `పెద్ది` సెట్ లో కావాల్సినంత సౌకర్యం, రక్షణ- గౌరవం లభించాయి. అందుకే తన బో*ల్డ్ పాత్రలో అంతగా గ్లామర్ ని చిందించిందని రాషా చెప్పిన దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
సారాంశంగా చెప్పాలంటే.. సినిమాల్లో గ్లామర్ ఉందా లేదా అనే దానికంటే... ఆ పని చేస్తున్నప్పుడు మహిళలకు లభించే స్వేచ్ఛ, సౌకర్యం, గౌరవం ప్రాథమికమైనవి. ఇతరుల అభిప్రాయాలు లేదా విమర్శల కంటే... తాను చేసే పనిపై నటికి స్పష్టత - సంతృప్తి ఉంటే చాలని రాషా తడాని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారుల హక్కులు.. వారి ఆత్మాభిమానానికి ప్రాధాన్యత ఇవ్వడమే నిజమైన సౌకర్యమైన సినిమా సంస్కృతికి సంకేతం. రాషా తడానీ ఆజాద్ అనే హిందీ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే చిత్రంతో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయ్యారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.