బ్లాక్‌బస్టర్ హీరో కొత్త మూవీ అప్‌డేట్
'ధురంధర్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు.
'ధురంధర్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. దాదాపు మూడు ఏళ్ల పాటు ధురంధర్ పై వర్క్ చేసిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన లుక్‌ను పూర్తిగా మార్చుకుని రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమాలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈమధ్య కాలంలో రణ్‌వీర్ సింగ్ తన కొత్త సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొన్నాడని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న స్క్రిప్ట్ చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని, నటీనటుల ఎంపిక సైతం దాదాపుగా పూర్తి కావడంతో షూటింగ్‌కు అంతా రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారని సమాచారం అందుతోంది.
జై మెహతా దర్శకత్వంలో...
హన్సల్ మెహతా తనయుడు జై మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. రణ్వీర్ సింగ్, జై మెహతా కాంబోలో రూపొందబోతున్న ఈ సినిమాకోసం భారీ బడ్జెట్‌ను రెడీ చేశారట. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రూ.300 కోట్ల బడ్జెట్‌తో రణ్‌వీర్ సింగ్ హీరోగా జై మెహతా మూవీని రూపొందించేందుకు గాను ప్లాన్ చేస్తున్నాడట. రణ్‌వీర్ సింగ్ గత చిత్రాల ఫలితం నేపథ్యంలో ఈ బడ్జెట్ రిస్క్ కాకపోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. సినీ విశ్లేషకులు సైతం రణ్‌వీర్ సింగ్ కొత్త సినిమా పై నమ్మకం ఉంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు 'ప్రళయ్' అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగిందని, స్క్రిప్ట్ లాక్ చేయడంతో షూటింగ్‌కు ఏర్పాట్లు చకచక జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని ఎంపిక చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ తర్వాత...
ధురంధర్ తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం ప్రళయ్ షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల నుంచి అంటే ఆగస్టు నుంచి కీలక సన్నివేశాల చిత్రీకరణ చేసేందుకు గాను జై మెహతా ప్లాన్ చేశాడు. దాదాపుగా రెండు నెలల పాటు ఈ మొదటి షెడ్యూల్ ఉంటుందని సమాచారం అందుతోంది. మొదటి షెడ్యూల్ తర్వాత సినిమా ఎక్కువగా ఆస్ట్రేలియాలో చిత్రీకరించాల్సి ఉంటుందట. ఆ షెడ్యూల్‌ను వచ్చే ఏడాదిలో ప్లాన్ చేయబోతున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ భార్య దీపికా పదుకునే ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. ఈ ఏడాది చివర్లో దీపికా సెకండ్ బేబీకి జన్మనిచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ పెటర్నిటీ లీవ్ పెట్టబోతున్నట్లుగా ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
ప్రళయ్ మూవీతో రణ్‌వీర్ సింగ్...
వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న ప్రళయ్ మూవీ మొదటి షెడ్యూల్ షూటింగ్ దీపావళి వరకు పూర్తి చేయబోతున్నారట. ఆ తర్వాత నుంచి వచ్చే ఏడాది ఆరంభం వరకు రణ్‌వీర్ సింగ్ పెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నాడు. భార్య దీపికా పదుకునే కు తోడుగా రణ్‌వీర్ సింగ్ ఉంటాడని తెలుస్తోంది. కనీసం మూడు నుంచి అయిదు నెలల పాటు రణ్‌వీర్ సింగ్ షూటింగ్స్ కు దూరంగా ఉంటాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రళయ్ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత రెండో షెడ్యూల్ కోసం రణ్‌వీర్ సింగ్ కనీసం మూడు నెలల సమయం తీసుకుంటాడని యూనిట్ సభ్యులు సైతం అంటున్నారు. అంటే వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమా తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రణ్‌వీర్ సింగ్ ప్రళయ్ మూవీని 2028 కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.