విదేశీ యువతులను వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీస్ వీరే!

ప్రేమకు సరిహద్దులు లేవంటారు ప్రేమికులు.. అందుకు నిదర్శనం మన దేశానికి చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు విదేశీ అమ్మాయిలతో ప్రేమలో పడి, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Update: 2026-07-14 05:23 GMT

ప్రేమకు సరిహద్దులు లేవంటారు ప్రేమికులు.. అందుకు నిదర్శనం మన దేశానికి చెందిన ఎంతోమంది సినీ ప్రముఖులు విదేశీ అమ్మాయిలతో ప్రేమలో పడి, పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు.. మన స్టార్స్ కొందరు విదేశీ మూలాలున్న సుందరీమణులను తమ జీవిత భాగస్వాములుగా మార్చుకున్నారు. రీసెంట్‌గా ఈ లిస్ట్‌లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా కూడా చేరారు. మన స్టార్స్ మనసు దోచిన ఆ విదేశీ భామలెవరో ఇప్పుడు చూద్దాం..

సిద్ధార్థ్ గల్లా - హైన్ కిమ్:

ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ చిన్న కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆయన తన ప్రేయసి అయిన సౌత్ కొరియన్ అమ్మాయి 'హైన్ కిమ్' తో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా:

టాలీవుడ్ పవర్‌స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విదేశీ వనితనే పెళ్లాడారు. రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

శశి కపూర్ - జెన్నిఫర్ కెండల్:

బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్ ప్రేమకథ కూడా చాలా గొప్పది. ఆయన బ్రిటిష్ నటి, థియేటర్ ఆర్టిస్ట్ అయిన జెన్నిఫర్ కెండల్‌ను ప్రేమించి 1958లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే జెన్నిఫర్ 1984లో క్యాన్సర్‌తో మరణించేవరకు శశి కపూర్ ఆమెతో ఎంతో అన్యోన్యంగా జీవించారు.

గుల్షన్ దేవయ్య - కల్లిరోయ్ టిజియాఫెటా:

బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య గ్రీకు నటి అయిన కల్లిరోయ్ టిజియాఫెటాను 2012లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్థల వల్ల వీరిద్దరూ 2020లో విడాకులు తీసుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. విడాకుల తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుని, తమ బంధానికి మరో అవకాశం ఇస్తూ ప్రస్తుతం ఇద్దరూ కలిసి డేటింగ్‌లో ఉన్నారు.

భాష, సంస్కృతులు వేరైనా మనసు కలిస్తే చాలని ఈ సెలబ్రిటీ జంటలు నిరూపించారు. విదేశీ సరిహద్దులు దాటి మన భారతీయ సంప్రదాయాలను గౌరవిస్తూ, మన స్టార్స్ చేతులు పట్టుకున్న ఈ విదేశీ కోడళ్లు మన ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

Tags:    

Similar News