'ధురంధర్ 2'లో మరో సర్‌ప్రైజ్!
బాలీవుడ్ హిట్ మెషీన్ ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన `ధురంధర్` మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది.;
బాలీవుడ్ హిట్ మెషీన్ ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన `ధురంధర్` మూవీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఆదిత్యధర్ ఎంచుకున్న స్టోరీ టెల్లింగ్, ట్రూ ఈవెంట్స్, పాకిస్థాన్ అండర్ వరల్డ్ నేపథ్యం. ల్యారీలో ఏం జరుగుతోంది?.. ఇండియాకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలకు అక్కడ బీజం పడుతోంది?..అందులో ఐఎస్ ఐ ఎలా భాగం అవుతూ తీవ్రవాదాన్ని ఇండియాపైకి ఉసిగొల్పుతోందనే షాకింగ్ విషయాలని ఈ సినిమాతో ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు.
మేకింగ్ పరంగా బాలీవుడ్ హీరో వర్షిప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన `ధురంధర్`... సినిమా మేకింగ్‌లోనూ విప్లవాత్మక మార్పులని తీసుకొచ్చి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌కి, అందులోనూ బాలీవుడ్ మేకర్స్‌కి ఓ వేకప్ కాల్‌గా మారిందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5న సైలెంట్‌గా విడుదలై కేవలం మౌత్ టాక్‌తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా పలు రికార్డుల్ని తరిగరాస్తూ వరల్డ్ వైడ్‌గా రూ.1250 కోట్లకు పైనే రాబట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని తిరగరాయడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రముఖ క్రిటిక్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీకి త్వరలో సీక్వెల్‌గా `ధురంధర్ పార్ట్ 2 రివేంజ్` రానున్న విషయం తెలిసిందే. సినిమా కెంటెంట్‌తో పాటు మ్యూజిక్ కూడా అందరిని వెంటాడటం వల్లే నిడివి 3గంటల 24 నిమిషాలు ఉన్నా ఎక్కడా బోర్ ఫీలవ్వలేదు. ఇందులో ప్రధానంగా అక్షయ్ ఖన్నా స్టెప్స్ వేసిన ఎంట్రీ సాంగ్ అదిరిపోయి అక్షయ్‌ఖన్నాతో పాటు 'ధురంధర్' మూవీని వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యేలా చేసింది. నెట్టింట జెన్ జీ బ్యాచ్‌ఫిదా కావడంతో రికార్డు స్థాయిలో వైరల్ అయింది.
బహ్రైన్‌కు చెందిన రాపర్ ఫ్లిప్పరాచి ఫేమస్ సాంగ్ `Fa9la`ని `ధురంధర్`లో యూజ్ చేయడం అది రికార్డు స్థాయిలో వైరల్‌గా మారి సినిమాకు మరింత ప్లస్ కావడం తెలిసిందే. బలోచ్ లీడర్‌గా అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్‌గా దీన్ని సినిమాలో వాడారు.. ఈ సాంగ్ స్టార్టింగ్‌లో అక్షయ్ ఖన్నా వేసిన సిగ్నేచర్ స్టెప్ ఏరేంజ్‌లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలోనే సెకండ్ పార్ట్ లో మరో సాంగ్‌ని పెడుతున్నారనే చర్చ మొదలైంది. దీనిపై బహ్రైన్ రాపర్ ఫ్లిప్పరాచి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు.
`ఈ విషయాన్ని నేను ఒక రహస్యంగా ఉంటాలనుకున్నాను. ఏదో ఒకటి మాత్రం సెకండ్ పార్ట్‌లో ఉంటుంది. అది ఏంటన్నది మాత్రం నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకోలేదు` అని చెప్పడం ఆసక్తిని రేఎత్తిస్తోంది. `ధురంధర్ 2` మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సారి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. పార్ట్ 1లో వైరల్‌గా మారిన రాపర్ ఫ్లిప్పరాచి..పార్ట్ 2లోనూ తన స్పెషల్ నంబర్‌తో వార్తల్లో నిలవడం ఖాయం.