నేషనల్ అవార్డు విషయంలో రాణీ ముఖర్జీ సెన్సేషనల్ కామెంట్స్
ఎంత బ్లాక్ బస్టర్లు అయినా కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ ను అన్ని విధాలా మెప్పిస్తాయి. అలానే కొందరు నటీనటులు మాత్రమే ఆడియన్స్ ను తమ నటనతో ఆకట్టుకోగలరు.;
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖ నటీనటులున్నారు. కానీ అందరి సినిమాలూ ఆడవు. ఆడిన అన్నీ సినిమాలూ కంటెంట్ పరంగా హిట్ అవాల్సిన పని కూడా లేదు. ఎంత బ్లాక్ బస్టర్లు అయినా కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ ను అన్ని విధాలా మెప్పిస్తాయి. అలానే కొందరు నటీనటులు మాత్రమే ఆడియన్స్ ను తమ నటనతో ఆకట్టుకోగలరు.
అలా ఆకట్టుకున్న వారిలో కూడా కొందరికే ప్రశంసలు, అవార్డులు దక్కుతాయి. ఏ అవార్డు అయినా ఒకరికే వస్తుంది. మిగిలిన వారు కేవలం పేరుతో సరిపెట్టుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఎవరికైనా అవార్డులు దక్కితే ఓ వర్గం జనాలు దానిపై చర్చలు చేసి, ఆ అవార్డు ఫలానా వారికి రావాల్సింది. ఫలానా సినిమాకు రావాల్సింది అని చెప్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు.
మొదటి సారి నేషనల్ అవార్డు అందుకున్న రాణీ ముఖర్జీ
అయితే ఒక అవార్డు వచ్చినప్పుడు ఎవరైనా దాన్ని ప్రశ్నిస్తే ఆ అవార్డు విలువ తగ్గిపోతుందని ఇటీవలే మొదటి నేషనల్ అవార్డును అందుకున్న బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ పేర్కొన్నారు. 2023లో రిలీజైన మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాకు గానూ రాణీ ముఖర్జీ రీసెంట్ గా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకోగా, నేషనల్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె చెప్పారు.
ఆ సంతోషం మాటల్లో చెప్పలేం
మనకు ఓ అవార్డు వచ్చినప్పుడు దానికి మనం అర్హులమని ప్రేక్షకులు కూడా భావిస్తే వచ్చే సంతోషం మాటల్లో చెప్పలేమని, అలా కాకుండా ఆమె యాక్టింగ్ కు అవార్డొచ్చిందా? ఆమె కంటే బెటర్ గా చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు కదా అని కామెంట్స్ వినిపిస్తే ఆ అవార్డు వచ్చినప్పటికీ దానికి వాల్యూ ఉండదని, తనకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారని, అందరి అంగీకారమే తనకు అవార్డు కంటే గొప్పగా అనిపించిందని, ఆడియన్స్ ను అలరించడమే నటీనటుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.