రణబీర్.. అప్పుడంతా అదే ధ్యాసలో ఉన్నారా?
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు.;
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఆయన.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు. మరెన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పుడు పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. త్వరలో ఆయా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
అయితే రణబీర్ కపూర్.. యానిమల్ మూవీతో భారీ హిట్ ను అందుకున్న విదితమే. తండ్రీ తనయుల మధ్య అనుబంధాన్ని చూపించే కథతో యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా రూపొందిన ఆ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. రూ.900 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది.
అంతే రీతిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే ఆ సినిమాను సైన్ చేశాక రణబీర్ కపూర్ ఎంత మక్కువ చూపించారో ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున రివీల్ చేశారు. ఆయన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ శివ ఇటీవల రీ రిలీజ్ అవ్వగా.. ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ సమయంలో పలు విషయాలను పంచుకున్నారు.
అయితే నాగార్జున, రణబీర్ కపూర్ కలిసి బ్రహ్మస్త్ర మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో ఎప్పుడు యానిమల్ మూవీ కోసమే రణబీర్ మాట్లాడేవారట. అప్పటికీ ఇంకా షూటింగ్ మొదలు కానప్పటికీ.. అదే ధ్యాసలో ఉండేవారని నాగార్జున తెలిపారు. యానిమల్ విషయంలో ఎలాంటి డౌట్ రణబీర్ కు లేదని అన్నారు.
అంతే కాదు.. సందీప్ వంగా అప్పటికే తెరకెక్కించిన అర్జున్ మూవీ తెలుగు వెర్షన్ ను చూసేవారని చెప్పారు. అందులోని ఓ కిస్ సీన్ ను తనకు చూపించారని గుర్తు చేసుకున్నారు. సన్నివేశం చాలా రియల్ గా ఉంది కదా అని అన్నట్లు తెలిపారు. అప్పుడు ఇంకా యానిమల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే జరుగుతున్నట్లు వెల్లడించారు.
యానిమల్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడు సెట్స్ లోకి అడుగుపెడతామా అనే ఉత్సాహంలో రణబీర్ ఎప్పుడూ ఉండేవారని నాగ్ తెలిపారు. అప్పటికి బ్రహ్మస్త్ర రూపొందుతున్నా.. యానిమల్ గురించి ఎక్కువగా ఆలోచించేవారని.. ఆ ఎగ్జైట్మెంట్ తో కనిపించేవారని అన్నారు. ప్రస్తుతం నాగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే యానిమల్ పై అంతలా ధ్యాసలో ఉన్న రణబీర్.. అందుకు తగ్గట్లే హిట్ కూడా అందుకున్నారనే చెప్పాలి.