• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కాంత'పై లీగల్ ఫైట్.....

'కాంత'పై లీగల్ ఫైట్.. రంగంలోకి దిగిన రానా!

| ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, ఇది బయోపిక్ కాదని, కాబట్టి ఎవరి పర్మిషన్లూ అవసరం లేదని లీగల్‌గా సేఫ్ అయ్యే ప్రయత్నం చేశారు.

By - M Prashanth
Update: 2025-11-12 12:36 GMT

దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న 'కాంత' సినిమా రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజులు ఉందనగా (నవంబర్ 14న రిలీజ్) లీగల్ టెన్షన్ మొదలైంది. ఈ సినిమా 1950ల నాటి తమిళ లెజెండరీ సూపర్ స్టార్ ఎం.కె. త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అని, అందులో ఆయన్ను చాలా తప్పుగా, అనైతికంగా చూపించారంటూ.. ఆయన మనవడు చెన్నై కోర్టులో పిటిషన్ వేశాడు. సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడంతో కోలీవుడ్‌లో కలకలం రేగింది.

ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ లాస్ట్ మినిట్ ఫైర్‌ను ఆపడానికి రానా, 'కాంత' టీమ్ నుంచి అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఏ ఒక్కరినీ టార్గెట్ చేయడం లేదని స్పష్టం చేశాడు. "మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు.. కాంత ఒక కల్పిత కథ" అంటూ రానా అఫీషియల్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేశాడు

ఈ ఒక్క స్టేట్‌మెంట్‌తో, ఇది బయోపిక్ కాదని, కాబట్టి ఎవరి పర్మిషన్లూ అవసరం లేదని లీగల్‌గా సేఫ్ అయ్యే ప్రయత్నం చేశారు. అయితే, ఇది పూర్తిగా కల్పితమైతే.. ఆ 1950ల సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ ఎందుకు? ఆ గొడవలేంటి? అనే ప్రశ్న వస్తుంది. దానికి కూడా రానా మరో క్లారిఫికేషన్ ఇచ్చాడు. "ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదు... కానీ, ఈ కథ 1950లు, 60లు, 70లలో జరిగిన పలు నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రాసుకున్నది" అని రానా ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

అసలు వివాదం ఏంటంటే.. MKT మనవడు వేసిన పిటిషన్‌లో.. 'కాంత'లో MKT గారిని చివరి రోజుల్లో అనైతికంగా, పేదవాడిగా చూపించారని ఆరోపించారు. "ఆయన చాలా గౌరవంగా, సంపన్నుడిగానే బతికారు" అని వాళ్లు వాదిస్తున్నారు. ఇప్పుడు రానా "మేం ఎవరినీ టార్గెట్ చేయడం లేదు, ఇది కల్పిత కథ" అని చెప్పడం, డైరెక్ట్‌గా ఆ ఆరోపణలను ఖండించడానికే అని అర్థమవుతోంది.

రిలీజ్‌కు రెండు రోజుల ముందు రానా ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చెన్నై కోర్టు ఈ పిటిషన్‌పై నవంబర్ 18 లోగా సమాధానం చెప్పాలని 'కాంత' టీమ్‌ను ఆదేశించింది. కానీ, రిలీజ్ 14నే ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా, ముందు ఆడియన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్లకు భరోసా ఇవ్వాలి. సినిమా ఆగదు, ఇది సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పడానికే రానా ఈ పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చాడని క్లియర్‌గా తెలుస్తోంది. రానా అయితే పబ్లిక్‌గా క్లారిటీ ఇచ్చాడు. ఇది ఫిక్షన్ అని, ఇన్‌స్పిరేషన్ మాత్రమే అని చెప్పేశాడు. కానీ, ఈ స్టేట్‌మెంట్ MKT ఫ్యామిలీని శాటిస్‌ఫై చేస్తుందా? లీగల్‌గా కోర్టు ఈ వాదనను యాక్సెప్ట్ చేస్తుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Tags:    
  • ranadaggubati 
  • dulquersalmaan 
  • kaantha 
  • tollywoodnews 
  • telugucinema 
  • filmcontroversy 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS