రమ్యా పసుపులేటి.. జిమ్‌లో అందాల మెరుపుతీగ

టాలీవుడ్‌లో చిన్న సినిమాలలలో హీరోయిన్‌గా కనిపించిన రమ్యా పసుపులేటి ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రాక్‌లో దూసుకుపోతుంది.;

Update: 2025-07-24 16:30 GMT

టాలీవుడ్‌లో చిన్న సినిమాలలలో హీరోయిన్‌గా కనిపించిన రమ్యా పసుపులేటి ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రాక్‌లో దూసుకుపోతుంది. ఇటీవల వర్కౌట్ మూడ్‌లో తీసుకున్న స్టైలిష్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. “ఇది అందం కాదు, శక్తి” అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్‌కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్పోర్ట్స్ డ్రెస్‌లో అద్దం ముందు నిలబడి తీసుకున్న సెల్ఫీలు చూస్తే.. ఆమె బాడీ మేకోవర్ ఎలా మారిందో స్పష్టంగా తెలుస్తోంది.


చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తన లుక్‌, స్టైల్‌తో ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతున్న ఫోటోలు చూసినవాళ్లంతా ఆమెలో వచ్చిన మార్పు చూసి షాక్ అవుతున్నారు. బాడీ షేప్ మెయింటైన్ చేయడమంటే అంత ఈజీ కాదు. కానీ రమ్యా మాత్రం శ్రమను ఉపేక్షించకుండా బాడీపై కేర్ తీసుకుంటూ కసిగా ముందుకు సాగుతోంది. గ్లామర్‌తో పాటు గట్టిగా కష్టపడుతున్నట్లు ఆమె ఫోటోలు చూపిస్తున్నాయి.


సినిమాల పరంగా చెప్పాలంటే.. రమ్యా తొలిసారి కమిట్మెంట్ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత రామ్ లీలా, గామీ, హుషారు వంటి సినిమాల్లో కనిపించింది. గ్లామర్ పాత్రలకే ఎక్కువగా చేయగా, యాక్టింగ్ టాలెంట్‌కి కూడా అవకాశం లభించింది. పెద్దగా హిట్స్ రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చేస్తోంది.


ఇప్పటికే ఓ వెబ్‌సిరీస్‌ షూట్ పూర్తి చేసినట్లు సమాచారం. వర్కౌట్ ఫోటోలు చూసినవాళ్లంతా “ఇప్పుడు రీ ఎంట్రీకి సిద్ధంగా ఉంది.. ఇది ఆ టీజరే” అంటున్నారు. సాధారణ ఫోటోల కంటే ఈ సారి వచ్చిన జిమ్ లుక్స్ ఆమెలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. ఫిట్నెస్ ను కంట్రోల్ చేయడమే కాదు, మానసికంగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఈ లుక్ చెబుతోంది.

Tags:    

Similar News