చరణ్ లుక్స్.. పూనకాలు గ్యారెంటీనా..?

పెద్ది ఫస్ట్ షాట్ తోనే మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి సినిమా గురించి శాంపిల్ చూపించాడు బుచ్చి బాబు. చరణ్ ని ఎలా చూడబోతున్నాం అని ఒక అంచనా క్రియేట్ చేశాడు డైరెక్టర్.;

Update: 2025-08-19 10:30 GMT

గేమ్ ఛేంజర్ ఇచ్చిన షాక్ తో వెంటనే ఒక సూపర్ హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అందుకే బుచ్చి బాబుతో పెద్ది అంటూ ఒక పవర్ ఫుల్ మూవీతో వస్తున్నాడు. ఉప్పెనతో తొలి సినిమానే సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు రెండో సినిమానే గ్లోబల్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందట. పెద్ది ఫస్ట్ షాట్ తోనే మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కి సినిమా గురించి శాంపిల్ చూపించాడు బుచ్చి బాబు. చరణ్ ని ఎలా చూడబోతున్నాం అని ఒక అంచనా క్రియేట్ చేశాడు డైరెక్టర్.

పెద్ది చరణ్ రోల్ వేరియేషన్స్..

ఐతే పెద్ది ఫస్ట్ షాట్ లో లుక్ తోనే మెగా ఫ్యాన్స్ సూపర్ సాటిస్ఫై అనుకుంటే.. అదొక్కటేనా చాలా ఉన్నాయి.. దాచేశాం అన్నట్టుగా.. ఈ సినిమాలో చరణ్ రోల్ లోని వేరియేషన్స్.. అందుకు తగినట్టుగా లుక్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట. పెద్ది ఫస్ట్ షాట్ లో చూసిన రంగ్ లుక్ మాత్రమే కాదు. మరో ఊర మాస్ లుక్.. ఇంకా మోడ్రెన్ లుక్ ఇవన్నీ కూడా పెద్దిలో ఉంటాయట. ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ఇవ్వడమే కాదు మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అనేస్తున్నారు.

పెద్ది సినిమాలో మిగతా కథ కథామీషు ఎలా ఉన్నా చరణ్ లుక్స్ తోనే పూనకాలు తెప్పించేలా చేస్తున్నాడట బుచ్చి బాబు. డెఫినెట్ గా ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా చేస్తుందని అంటున్నారు. సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకు రానుంది.

ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ ..

ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సినిమాను వేరే లెవెల్ కి తీసుకెళ్తాయని టాక్. పెద్ది లో ఒక క్రేజీ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చి బాబు. ఈ సినిమాకు ఆ సాంగ్ కూడా సూపర్ హైప్ ఎక్కించేస్తుందని టాక్. పెద్ది రిలీజ్ ని 2026 మార్చి 28న ఫిక్స్ చేశారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. గేం ఛేంజర్ రిజల్ట్ భారీ షాక్ ఇవ్వగా పెద్దితో ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ట్రీట్ ఇవ్వాలని చరణ్ గట్టి ఎఫర్ట్ పెడుతున్నాడు. సినిమా గురించి వస్తున్న లీక్స్ చూస్తుంటే లెక్కకు మించి డబుల్ జోష్ తెచ్చేలా ఉంది.

Tags:    

Similar News