పెద్ది ఫ‌స్ట్ షాట్ పై చ‌ర‌ణ్ పోస్ట్.. నెట్టింట వైర‌ల్

సుమారు రెండు మూడేళ్లు ఈ సినిమా స్క్రిప్ట్ పైనే వ‌ర్క్ చేసిన బుచ్చిబాబు పెద్ది మూవీని నెక్ట్స్ లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తోంది.;

Update: 2025-04-05 14:06 GMT

ఆర్ఆర్ఆర్ హీరో, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న బుచ్చి బాబు చేస్తున్న రెండో సినిమా ఇదే. రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో 16వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సుమారు రెండు మూడేళ్లు ఈ సినిమా స్క్రిప్ట్ పైనే వ‌ర్క్ చేసిన బుచ్చిబాబు పెద్ది మూవీని నెక్ట్స్ లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలుండ‌గా, ఈ సినిమా నుంచి శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా ఏప్రిల్ 6వ తేదీ ఉద‌యం 11.45 గంట‌ల‌కు పెద్ది ఫ‌స్ట్ షాట్ ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ గ్లింప్స్ గురించి గ‌త వారం రోజులుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో ఎంతో మంచి టాక్ వినిపిస్తోంది. గ్లింప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంద‌ని కొంద‌రంటుంటే, గ్లింప్స్ చూశాక కొన్నాళ్ల పాటూ బుచ్చి బాబు టేకింగ్ గురించి మాట్లాడుకుంటార‌ని మ‌రికొంద‌రంటూ దానిపై హైప్ పెంచుతున్నారు. దీంతో ఈ గ్లింప్స్ ఎలా ఉండ‌బోతుందా అని మెగా ఫ్యాన్స్ లో ఆస‌క్తి ఎక్కువైపోతుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు పెద్ది హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ గ్లింప్స్ పై అప్డేట్ ఇచ్చాడు. పెద్ది ఫ‌స్ట్ షాట్ అంటూ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టిన చ‌ర‌ణ్ తాను గ్లింప్స్ ను చూశాన‌ని, చాలా సూప‌ర్ గా ఉంద‌ని, ఈ గ్లింప్స్ ను అంద‌రూ తెగ ప్రేమించేస్తార‌ని, గ్లింప్స్ కు ఏఆర్ రెహ‌మాన్ సంగీతం స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ కానుంద‌ని తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఆట‌కూలీగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.

Tags:    

Similar News