రేసులోనే పెద్ది.. డౌట్ లేదంతే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా 2026 మార్చి 27న రిలీజ్ లాక్ చేశారు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ సినిమా నుంచి రిలీజైన చికిరి సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా ఫస్ట్ షాట్ గా వచ్చిన టీజర్ పెద్ది పై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఐతే పెద్ది సినిమా రిలీజ్ విషయంలో ఇంకా డౌట్ కొనసాగుతూనే ఉంది.
ది ప్యారడైజ్, పెద్ది రెండు సినిమాలు..
చరణ్ పెద్ది సినిమాను మార్చి 27 రిలీజ్ ఫిక్స్ చేశారు. మార్చి 26న నాని ది ప్యారడైజ్ సినిమా వస్తుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో దసరా తర్వాత వస్తున్న ది ప్యారడైజ్ మీద భారీ హైప్ ఏర్పడింది. ది ప్యారడైజ్, పెద్ది రెండు సినిమాలు వెంట వెంటనే రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్నాయి. రేసులో ఏ సినిమా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదనిపిస్తుంది.
ఐతే రీసెంట్ గా పెద్ది సినిమానే మార్చి 27 నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ ఆ వార్తలకు మరోసారి హీరో ద్వారా చెక్ పడింది. లేటెస్ట్ గా ఛాంపియన్ సినిమా ఈవెంట్ కి వచ్చిన చరణ్ పెద్ది సినిమా మార్చి 27న వస్తుందని మరోసారి అనౌన్స్ చేశాడు. సో పెద్ది అయితే అనుకున్న డేట్ కే వచ్చేలా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక నాని కూడా తన ప్రమోషన్స్ లో మార్చి 26 రిలీజ్ అని చెబుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్..
పెద్ది డేట్ న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అనుకున్నారన్న టాక్ వచ్చింది. కానీ మళ్లీ ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సమ్మర్ కి షిఫ్ట్ చేసి పెద్దిని అనుకున్న డేట్ కే తీసుకు రావాలని ప్లాన్ చేశారు మైత్రి మూవీ మేకర్స్.
సో చరణ్ అనౌన్స్ మెంట్ తో మరోసారి పెద్ది అనుకున్న డేట్ కి రావడం పక్కా అని తెలుస్తుంది. బుచ్చి బాబు ఈ సినిమా మీద తన ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడని తెలుస్తుంది. పెద్ది సినిమా తో చరణ్ మాస్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. RRR తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ నిరాశపరచడంతో పెద్ది మీద మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పెద్ది ప్యారడైజ్ మధ్య కచ్చితంగా ఒక క్రేజీ ఫైట్ జరిగేలా ఉంది. ఐతే రెండు సినిమాలు కూడా కంటెంట్ విషయంలో తమ బలాన్ని చూపించేలా ఉన్నాయి. పెద్ది తర్వాత చరణ్ సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత డైరెక్టర్స్ ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు.