ఆలియా బులుగు చీర‌పై రామాయ‌ణ ఘ‌ట్టాలు

ఆ రోజు సంప్రదాయ దుస్తుల కోడ్‌ను అనుసరిస్తూ అలియా భట్ ధ‌రించిన చీర అనేక కారణాల వల్ల అభిమానుల దృష్టిని ఆకర్షించింది.;

Update: 2024-01-24 17:46 GMT

జనవరి 22, సోమవారం నాడు ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు హాజరైన బాలీవుడ్ ప్రముఖులలో అలియా భట్ కూడా ఉంది. ఆమె తన భర్త రణబీర్ కపూర్‌తో కలిసి ఈ వేడుక‌కు విచ్చేసింది. ఈ వేదిక వ‌ద్ద చూపుల‌న్నీ ఆలియా క‌ట్టుకున్న చీర‌పైనే. అంత‌గా దీనిలో ఏం ఉంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.


నిజానికి ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఈవెంట్ కోసం అలియా భట్ మాధుర్య క్రియేషన్స్ దుస్తుల లేబుల్ షెల్ఫ్‌ల నుండి మణి నీలం రంగు మైసూర్ సిల్క్ చీరను ధరించి సంప్రదాయ అవతారంలో కనిపించింది. ఆ రోజు సంప్రదాయ దుస్తుల కోడ్‌ను అనుసరిస్తూ అలియా భట్ ధ‌రించిన చీర అనేక కారణాల వల్ల అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అలియా భట్ చీరపై ఆక‌ర్ష‌ణీయ‌మైన బొమ్మ‌లు అంద‌రి దృష్టిలో ప‌డ్డాయి. రామాయణంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను వర్ణించే చేతి పెయింటింగ్ తో ఈ చీర‌ను అలంకరించారు. ఇందులో రాముడు, హనుమంతుడు, సీతా దేవి ఫోటోలు కూడా ఉన్నాయి.


చీర పూర్తి చేయడానికి 100 గంటలు:


సాంప్రదాయ పట్టచిత్ర శైలిలో చేసిన సూక్ష్మమైన బొమ్మ‌ల‌తో ఆలియా చీర‌ను పూర్తి చేయడానికి సుమారు 100 గంటలు పట్టింది. అలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన మిర్ర‌ర్ సెల్ఫీని షేర్ చేస్తూ.. ``రామాయణం ఇతిహాసాన్ని వర్ణించే ఈ పట్టచిత్ర చీరను తయారు చేయడానికి 100 గంటల ప్రయత్నం సాగింది`` అని రాసింది. స్టైలిస్ట్ అమిత్ పటేల్ ఈ చీర‌ను డిజైన్ చేసారు. రామాయణంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చీరపై పెయింటింగుల రూపంలో డిజైన్ చేసారు. ..శ్రీ‌రాముడు శివ ధనుష్‌ను విచ్ఛిన్నం చేయడం, గుహతో పడవలో, బంగారు జింక, కిడ్నాప్, రామసేతు, హనుమంతుడు మా సీతకు ఉంగరాన్ని సమర్పించడం.. రామ పట్టాభిషేకం, రాజు దశరధులు వాగ్దానం వ‌గైరా అంశాల‌ను చీర‌పై డిజైన్ చేసారు అని తెలిసింది. మరోవైపు ఈ వేడుక‌లో రణబీర్ కపూర్ పూర్తి తెలుపు రంగు సంప్రదాయ దుస్తుల‌లో క‌నిపించాడు. తెల్లటి కుర్తా పైజామా ధరించిన రణబీర్ తెల్లటి శాలువా కప్పుకున్నాడు.


కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆలియా భట్ 2023 త‌న‌కు క‌లిసొచ్చిన సంవ‌త్స‌రం. కరణ్ జోహార్ రొమాంటిక్ కామెడీ చిత్రం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీతో విజ‌యం అందుకుంది. ఆ తర్వాత ఆమె హాలీవుడ్ తొలి చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్ లో గాల్ గాడోట్ తో క‌లిసి నటించింది. ప్రస్తుతం వాసన్ బాలాతో జిగ్రా అనే చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇందులో ఆలియా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, తన సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్‌ ఈ చిత్రానికి సహ నిర్మాణ సంస్థ‌గా వ్యవహరిస్తోంది. భారీ అంచనాలున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో థియేటర్లలోకి రానుంది.


Tags:    

Similar News