'రామాయణం' కోసం 4000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది?
తాజా పాడ్ కాస్ట్ లో `రామాయణం` మేకింగ్ విషయంలో తన ఫ్యాషన్ ని మరోసారి నిర్మాత నమిత్ బయటపెట్టారు.;
11,000 మంది ఉద్యోగులకు కరోనా క్రైసిస్ సమయంలో జీతాలిచ్చిన కంపెనీ ప్రైమ్ ఫోకస్- డి.ఎన్.ఇ.జి. ఈ కంపెనీల వెనక శక్తి నమిత్ మల్హోత్రా ఇప్పుడు `రామాయణం` లాంటి భారీ పాన్ ఇండియా ఫ్రాంఛైజీని నిర్మిస్తున్నారు. రామాయణం కథను రెండు భాగాలుగా ఆయన వెండితెరకెక్కిస్తున్నారు. దీని కోసం 3,300 కోట్ల నుంచి 4,000 కోట్ల మధ్య ఖర్చు చేయనున్నారని కథనాలొచ్చాయి.
తాజా పాడ్ కాస్ట్ లో `రామాయణం` మేకింగ్ విషయంలో తన ఫ్యాషన్ ని మరోసారి నిర్మాత నమిత్ బయటపెట్టారు. ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ పెడుతున్నాము? ఈ నిధి అంతా ఎక్కడి నుంచి వస్తోంది? అంటూ అడుగుతున్నారు. అది ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అన్నది మ్యాటర్ కాదు. భారతీయ పురాణేతిహాస కథను ప్రపంచానికి పరిచయం చేయడానికి మేం ఏం చేసామన్నది ముఖ్యం. ఇప్పటివరకూ భారతదేశంలో కాపీ చేయని కథతో సినిమాలు తీస్తున్నామని మంచి పేరు రావాలి... అని నమిత్ అన్నారు.
ఇప్పటికే పార్ట్1 షూటింగ్ దాదాపు పూర్తయింది. మేం సినిమాని ప్రారంభించినప్పుడు పెద్ద విజన్ తో బరిలో దిగాము. నా దగ్గర డబ్బు ఉందా లేదా? అన్నది కూడా ఆలోచించలేదు. నటీనటులు సహా ప్రతి ఒక్కరూ అడిగారు.. మీ వద్ద అంత పెద్ద నిధి ఉందా? అని.. కానీ మేం మొదట సినిమా పూర్తి చేసాను.. ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు! అని చెప్పారు. ఇంత డబ్బు ఎలా సేకరించగలిగారు? అని ప్రశ్నిస్తున్నారు.``డబ్బు ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలియదు. ఎలా సాధ్యం? అని అడిగితే అది నాకు కూడా తెలియదు. అదంతా వేరే టాపిక్. ప్రతిదీ దానంతట అదే జరుగుతోంది. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ లేదా వ్యాపార ప్రతిపాదన కాదు`` అని మల్హోత్రా అన్నారు. డబ్బు ఎంత ఖర్చవుతోందో నేను చూడను. ప్రొడక్ట్ ఎంతవరకూ రెడీ అయందో చూస్తాను.. ఎక్కడా రాజీకి రాను అని తెలిపారు.
హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ ఎక్స్ అందించిన డిఎన్.ఇజి పనితనంతో ఎన్నో ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నామని నమిత్ మల్హోత్రా చెప్పారు. కానీ రామాయణం వాటన్నింటికంటే పెద్దది.. అంతకుమించి సాధిస్తామని అన్నారు. అంతేకాదు.. మారుతున్న ట్రెండ్ లో AI-ఆధారిత వాయిస్ ని భాష పరంగా లోకలైజేషన్ కోసం ఉపయోగించి దేశీయంగా, అంతర్జాతీయంగా 30 నుండి 50 భాషలలో రామాయణాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.
రామాయణం చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యష్ నటిస్తున్నారు. రామాయణం పార్ట్ 1 వచ్చే ఏడాది దీపావళికి పార్ట్ 2 దీపావళి 2027 నాటికి విడుదలకు ప్లాన్ చేసారు. నటుడు యష్ ఈ చిత్రానికి సహనిర్మాత. రెహమాన్, హన్స్ జిమ్మర్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు.