జూలై 3న 'రామాయ‌ణం' డి-డే

రణబీర్ కపూర్ -సాయిప‌ల్ల‌వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `రామాయణం-1` 2025-26 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి.;

Update: 2025-07-01 04:00 GMT

రణబీర్ కపూర్ -సాయిప‌ల్ల‌వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `రామాయణం-1` 2025-26 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి. నితీష్ తివారీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొంత‌కాలంగా నితీష్ బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాల ప‌రంగా స్థ‌బ్ధుగా ఉండ‌టంతో అభిమానుల్లో నీర‌సం అలుముకుంది. అయితే తాజా స‌మాచారం మేర‌కు `రామాయణం` అధికారిక టైటిల్, లోగోని జూలై 3న డిజిటల్‌గా ఆవిష్కరిస్తార‌ని తెలిసింది.

పింక్‌విల్లా వివరాల ప్రకారం.. రామాయ‌ణం లోగో లాంచ్ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్ కి అధికారిక ప్రకటనగా భావించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే తారాగ‌ణం స‌హా ఇత‌ర‌ వివరాలు వెల్లడయ్యాయి. టైటిల్ టీజ‌ర్ రాక‌తో ప్రాజెక్ట్ విజువ‌ల్ గ్రాండియారిటీపై మ‌రింత స్ప‌ష్ఠ‌త వ‌స్తుంది. టీజర్ ఇప్పటికే సిద్ధమైంద‌ని తెలుస్తోంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్, నితీష్‌ తివారీ రూపొందించిన గ్రాండ్ పౌరాణిక విశ్వంలోకి స్నీక్ పీక్ గా భావించాలి. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రావడానికి ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్నందున, నిర్మాతలు విడుదలను వాయిదా వేస్తున్నారు.

ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్ర‌బృందం ప్లాన్ చేస్తోంది. మొదటి భాగం 2026 దీపావళికి , రెండవ భాగం 2027 దీపావళికి విడుద‌ల‌వుతాయి. భార‌తీయ సంస్కృతి గొప్ప‌తనాన్ని నేటి అధునాత‌న సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకుంటూ తెర‌పై అద్భుతంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మిద‌ని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీ‌రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటించారు.

Tags:    

Similar News