నెక్స్ట్ బడా మూవీస్.. ఇప్పుడంతా వాటిదే డామినేషనా?
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు.. ఓపెనింగ్స్ గ్యారెంటీ, హిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనే అభిప్రాయం ఉండేది.
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే చాలు.. ఓపెనింగ్స్ గ్యారెంటీ, హిట్ వచ్చే అవకాశాలు ఎక్కువ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఫార్ములా ఒక్కటే పనిచేసే పరిస్థితి లేదు. ఓటీటీ ఎఫెక్ట్, వరల్డ్ రేంజ్ సినిమాలకు ప్రేక్షకులు అలవాటు పడటం, విజువల్ ఎక్స్పీరియన్స్ పై పెరిగిన అంచనాలతో ఇండియన్ సినిమా కొత్త దిశగా పయనిస్తోంది. అందుకే ఇప్పుడు స్టార్ హీరో కంటే భారీ కాన్సెప్ట్, స్ట్రాంగ్ స్టోరీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న చిత్రాలే ఎక్కువ చర్చకు వస్తున్నాయి.
ఆ విషయంలో ఫస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్న చిత్రం రామాయణ. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఆ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ వంటి స్టార్ నటులు ఉన్నప్పటికీ.. సినిమాపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం రామాయణాన్ని వరల్డ్ రేంజ్ విజువల్స్ తో చూపించాలనే ప్రయత్నమే. అత్యాధునిక టెక్నాలజీ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతోంది. అదే తరహాలో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD తొలి భాగం విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
పురాణాల నేపథ్యాన్ని ఫ్యూచర్ వరల్డ్ తో మిక్స్ చేస్తూ రూపొందించిన కథ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఇప్పుడు కల్కి పార్ట్-2పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక్కడ కూడా స్టార్ హీరో కంటే మూవీ సృష్టించిన కొత్త ప్రపంచమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి కూడా ఇదే కోవలో నిలుస్తోంది. మహేష్ బాబు హీరో అయినప్పటికీ.. అడ్వెంచర్ నేపథ్యం, ఇంటర్నేషనల్ రేంజ్ మేకింగ్ సినిమాను హాట్ టాపిక్ గా మార్చాయి.
అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న రాకాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడంతో ఆసక్తి ఉన్నా.. ప్రేక్షకులు ఎదురుచూస్తున్నది స్టార్ కోసం కాదు. కొత్త కథ, విజువల్ గ్రాండియర్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందన్నదే ప్రధాన చర్చగా మారింది. ఇక జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందనున్న కొత్త చిత్రం కూడా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ అంశాలతో తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూనిక్ కాన్సెప్ట్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్-2: దేవ్పై కూడా అప్డేట్లు లేకపోయినా.. ఆ ఫాంటసీ యూనివర్స్ ను మరింత విస్తరించే చిత్రంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఏదేమైనా ఇండియన్ సినిమా ఇప్పుడు మరో దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు స్టార్ హీరో పేరు చాలు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు కొత్త ప్రపంచాలను, అద్భుతమైన విజువల్ అనుభూతిని, స్ట్రాంగ్ కథలు కోరుకుంటున్నారు. అందుకే దర్శకులు సరికొత్త ఆలోచనలు, మోడ్రన్ టెక్నాలజీ, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాబోయే భారీ చిత్రాల రిజల్ట్స్ ఎలా ఉన్నా.. ఇండియన్ సినిమా తన మార్క్ ను మరింత స్ట్రాంగ్ గా చాటే ప్రయత్నం మాత్రం కనిపిస్తోంది.