• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గేమ్ ఛేంజ‌ర్' థ‌ర్డ్...

'గేమ్ ఛేంజ‌ర్' థ‌ర్డ్ సింగిల్ ఇంకా నా మ‌న‌సులోనే!

| `గేమ్ ఛేంజ‌ర్` లిరిక‌ల్ సింగిల్స్ హ‌డావుడి మొద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది

By - Tupaki Desk
Update: 2024-11-21 17:48 GMT

`గేమ్ ఛేంజ‌ర్` లిరిక‌ల్ సింగిల్స్ హ‌డావుడి మొద‌లైంది. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు శ్రోత‌ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా థ‌ర్డ్ సింగిల్ కి ముహూర్తం పెట్టారు. ఈ విష‌యాన్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ రివీల్ చేసాడు. పాట‌కు సంబంధించిన అనౌన్స్ మెంట్ న‌వంబ‌ర్ 22న‌, ప్రోమోని 25న‌...సాంగ్ ని 27న రిలీజ్ చేస్తున్న‌ట్లు థ‌మ‌న్ ట్విట‌ర్ లో ప్ర‌క‌టించాడు. ఇదొక బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్.

ప్రేక్ష‌కుల్ని కొత్త వ‌ర‌ల్డ్ లోకి తీసుకెళ్ల‌బోయే పాట అంటూ థ‌మ‌న్ అంచ‌నాలు పెంచేసాడు. తాజాగా ఈ పాట గురించి గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. `విని చాలా రోజులైంది. కానీ ఇంకా నా మ‌నసులో మారు మ్రోగుతూనే ఉంది. విన్న వెంట‌నే న‌చ్చేసే మోలోడీ అంటూ రాసుకొచ్చారు. థ‌మ‌న్ నుంచి రాబోతున్న నెక్స్ట్ లెవల్ సాంగ్ గా చెప్పుకొచ్చారు. దీంతో ఆ పాట ఎప్పుడు విందామా? అన్న ఆస‌క్తి అంద‌రిలో మొద‌లైంది.

మెలోడీల‌ను ప్రేమించే శ్రోత‌లెంతో మంది. రామ్ చ‌ర‌ణ్ నుంచి స‌రైన మెలోడీ సాంగ్ వ‌చ్చి చాలా కాల‌మైంది. గ‌త సినిమా `ఆర్ ఆర్ ఆర్` లో ఇలాంటి మెలోడీలు లేవు. అందులోనూ హీరోయిన్ కాంబినేష‌న్ పాట‌లు లేవు. దీంతో మెగా అభిమానుల‌కు అదో దాహంగా మారింది. ఇప్పుడా కోరిక `గేమ్ ఛేంజ‌ర్` థ‌ర్డ్ సింగిల్ తో తీర‌బోతుంది. చ‌ర‌ణ్‌-కియారా అద్వాణీ మ‌ధ్య సాగే బ్యూటీఫుల్ మెలోడీగా తెలుస్తుంది.

రిలీజ్ కి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌యం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రి 10న సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో ఎస్.జె.సూర్య, అంజలి, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. దిల్ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.

విని చాలా రోజులయింది కానీ ఇంకా నా మనసులో మారుమోగుతోంది Next level music production from @MusicThaman brotherవిన్నవెంటనే నచ్చేసే మెలోడీ 👌Cant wait for you all to experience it❤️#GamechangerThirdSingle

— RamajogaiahSastry (@ramjowrites) November 21, 2024
Tags:    
  • Ramajogaiahsastry 
  • Thaman 
  • Ramcharan 
  • Gamechangerthirdsingle 
  • Gamechangermovie 
  • Tollywood 
  • Shankar 
  • Kiara 

Similar News

సీతాదేవి పాత్ర‌పై విమ‌ర్శ‌లు.. 'ఇఫీ' వేదిక‌గా సాయిప‌ల్ల‌వి స‌మాధానం ఇదే!

2026-11-21 18:53 GMT

వేదం డైరెక్టర్ తో మళ్లీ జతకడుతున్న అల్లు అర్జున్!

2026-11-21 18:52 GMT

శ్రీలీలకు సపోర్ట్ గా హీరో కొడుకు.. ఆ రద్దిలో ఇలా..

2026-11-21 18:50 GMT

నితిన్ కెరీర్ బెస్ట్.. నాని మాట ఇంకా పెద్దదే!

2026-11-21 18:48 GMT

న‌న్ను తీర్చిదిద్ది స్టార్‌డ‌మ్ ఇచ్చింది ఆ ప‌రిశ్ర‌మే.. ర‌కుల్ మ‌న‌సు!

2026-11-21 18:48 GMT

హనుమాన్-2.. తేలిగ్గా తీసుకోలేం

2026-11-21 17:40 GMT

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

Copyright @2026

Powered by Blink CMS