అమెరికాలో 'రామ్' రచ్చ మొదలైంది.. ఆల్ టైమ్ రికార్డ్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈసారి బాక్సాఫీస్ వేటను గట్టిగానే మొదలుపెట్టాడు.;

Update: 2025-11-27 05:30 GMT

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈసారి బాక్సాఫీస్ వేటను గట్టిగానే మొదలుపెట్టాడు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్, ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రీమియర్ షోలతోనే రామ్ తన కెరీర్ లో సరికొత్త రికార్డును నెలకొల్పి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చాడు.




 


లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం, 'ఆంధ్ర కింగ్ తాలూకా' నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్ గా నిలిచింది. రామ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. గతంలో 'స్కంద' సినిమాకు వచ్చిన ప్రీమియర్ కలెక్షన్స్ ను ఈ సినిమా అధిగమించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేకర్స్ కూడా ఈ రికార్డును అఫిషియల్ గా ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు.

ఈ భారీ ఓపెనింగ్స్ వెనుక రామ్ అండ్ టీమ్ చేసిన ప్రమోషనల్ టూర్ కీ రోల్ ప్లే చేసింది. రిలీజ్ కు ముందే రామ్, హీరోయిన్ భాగ్యశ్రీ ఇతర టీమ్ మెంబర్స్ తో కలిసి అమెరికాలో పర్యటించారు. అక్కడి అభిమానులను కలుసుకుని, వారితో కలిసి ప్రీమియర్ షోలు చూస్తామని చెప్పడం తెలుగు ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఒక స్టార్ హీరో ఇలా డైరెక్ట్ గా వచ్చి ప్రమోట్ చేయడం అక్కడి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. సినిమాకు పాజిటివ్ బజ్ కూడా తోడవ్వడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రీమియర్స్ ద్వారానే రామ్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, రామ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న 'వన్ మిలియన్ డాలర్' క్లబ్ లోకి ఈ సినిమా ఈజీగా ఎంటర్ అయ్యేలా కనిపిస్తోంది.

ఒక సూపర్ స్టార్, ఫ్యాన్ కి మధ్య జరిగే ఒక ఫీల్ గుడ్ జర్నీలా ఈ సినిమా ఉంటుందని ముందుగానే మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక టీజర్ ట్రైలర్ సాంగ్స్ కూడా పాజిటివ్ హైప్ క్రియేట్ చేశాయి. ఫ్యాన్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్ కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ ఉంది. మొత్తానికి 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఓవర్సీస్ జర్నీ గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. "సాగర్ జస్ట్ బాక్సాఫీస్ రైడింగ్ స్టార్ట్ చేశాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్ నిజమవుతోంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. ఇక మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

Tags:    

Similar News