యాక్షన్ డైరెక్టర్ గా మరో వారసుడు!
టాలీవుడ్ లో ఫేమస్ స్టంట్ మాస్టర్లు ఉన్నది కొద్ది మందే. వారిలో బాగా ఫేమస్ అయిన వారు ఎవరంటే రామ్ -లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది.;
టాలీవుడ్ లో ఫేమస్ స్టంట్ మాస్టర్లు ఉన్నది కొద్ది మందే. వారిలో బాగా ఫేమస్ అయిన వారు ఎవరంటే రామ్ -లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. సోదర ద్వయం ఇప్పటి వరకూ చాలా మంది హీరోలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసారు. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య నుంచి తర్వాత రం హీరోల వరకూ ఎంతో మందికి పని చేసారు.సూపర్ స్టార్ మహేష్ అభిమానించే కొరియోగ్రాఫర్స్ కూడా వీళ్లే. రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్లు సైతం రామ్ -లక్ష్మణ్ ఫైట్లకు ఫిదా అవుతుంటారు. యాక్షన్ డైరెక్టర్లగా ఎంత మంది వచ్చినా? రామ్-లక్ష్మణ్ ప్రత్యేకత మాత్రం వేరైందే.
తాజాగా బాలయ్య హీరోగా నటించిన `అఖండ 2` చిత్రానికి కూడా వీళ్లే ఫైట్స్ కంపోజ్ చేసారు. బాలయ్య మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన శైలికి తగ్గట్టు డిజైన్ చేసారు. అయితే బోయపాటి సినిమాల్లో ఫైట్స్ పరంగా ఆయన ఇన్వాల్వ్ మెంట్ కూడా ఉంటుంది. స్టంట్ మాస్టర్లతో కలిసి బోయపాటి కూడా పని చేస్తుంటా
రు. బోయపాటి కూడా యాక్షన్ పరంగా మంచి హింట్స్ ఇస్తుంటారు. అందుకే బోయపాటి చిత్రాల్లో స్టంట్స్ అంతగా హైలైట్ అవుతుంటాయి. అలాగే ఈ సినిమా కోసం రామ్ -లక్ష్మణ్ తనయుడైన రాహుల్ కూడా పనిచేసినట్లు తెలిపారు.
తమకు అప్ డెటెడ్ గా ఈ రంగంలోకి వస్తున్నాడన్నారు. సినిమాకు సంబంధించి కొన్ని పోరాట ఘట్టాలను డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఇలా ఉందని, ఇలా చేద్దామంటూ సూచనలు, సలహాలు ఇచ్చాడన్నారు. త్వరలోనే తనని కూడా యాక్షన్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నామన్నారు. ఏ రంగంలోనైనా పోటీ ఉన్నప్పుడే కొత్తదనం వస్తుందన్నారు. అలా యాక్షన్ లోకి కొత్తదనం రావాలన్నారు. గతంలో కూడా రామ్ లక్ష్మణ్ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలకు పని చేసామని..ఇకపై కొత్త వారు వచ్చి సక్సెస్ అవ్వాలన్నారు.
కొత్త వారు వచ్చినప్పుడే యాక్షన్ సన్నివేశాలు కూడా మారుతాయన్నారు. ఇక రాహుల్ విషయానికి వస్తే? ఇండ స్ట్రీలో అతడికి మంచి భవిష్యత్ ఉంటుంది. రామ్ -లక్ష్మణ్ సహకారంతో సొంత కాంపౌండ్ లోనే స్టంట్ మాస్టర్ గా రాటు దేలి ఉంటాడు. అతడు నిజంగా పని వంతుడైతే పిలిచే అవకాశాలిస్తారు. తండ్రికి ఉన్న పరిచయాలు కారణంగా చాలా మంది హీరోలు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. సరైన స్టంట్ మాస్టర్లు లేక చాలా మంది చెన్నై, ముంబై నుంచి స్టంట్ మాస్టర్లను తెచ్చుకుంటోన్న సంగతి తెలిసిందే.