శివ చైల్డ్ ఆర్టిస్ట్ కి వర్మ సారీ.. ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తోందంటే ?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దిశా మరియు దశ మార్చిన ఒక సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.;

Update: 2025-11-12 06:28 GMT

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దిశా మరియు దశ మార్చిన ఒక సినిమా శివ. రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటివరకు ఉన్న మూస దోరణి అంతా కూడా ఈ సినిమాతో పోగొట్టాడు వర్మ. చాలామంది ఈ విషయంలో వర్మ రూల్స్ బ్రేక్ చేశాడు అని అంటుంటారు. కానీ వాస్తవానికి అసలు రూల్స్ తెలియదు.

రియాలిటీ కి చాలా దగ్గరగా బతకడం వల్ల, ఎక్కువగా ఇండియన్ సినిమా నాలెడ్జ్ ఉండటం వలన. తన సినిమా కూడా అలానే ఉండాలి అనే ప్రయత్నంతో ఒరిజినల్ గా ఆ సినిమాను తెరకెక్కించాడు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు అనే విషయం ఎప్పటినుంచో రుజువు అవుతూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అడవి రాముడు లాంటి కమర్షియల్ సినిమాలు కూడా ఆడాయి. అదేవిధంగా శంకరాభరణం వంటి క్లాసిక్ సినిమాలు కూడా ఆడాయి. మొత్తానికి శివ సినిమా అందరికీ ఒక షాక్ ఇచ్చింది.

ఈ సినిమాలో నాగర్జున అన్నయ్యగా మురళీమోహన్ నటించిన సంగతి తెలిసిందే. మురళీమోహన్ కు ఈ సినిమాలో ఒక కూతురు ఉంటుంది. ఎక్కువగా బాబాయ్ బాబాయ్ అని నాగార్జునని పిలుస్తుంటుంది. ఆ పాప పాత్రకు కూడా మంచి యాక్టింగ్ స్కోప్ ఉంది.

అయితే ఒక తరుణంలో ఆ చిన్న పాపను సైకిల్ ముందు భాగంలో కూర్చుని పెట్టుకుని నాగార్జున సింగిల్ హ్యాండ్ తో సైకిల్ తొక్కుతూ వెళ్తుంటాడు. అది చాలా రిస్క్ షాట్. అయితే అప్పట్లో సినిమా మీద ఉన్న డెడికేషన్ తో ఇవి పెద్దగా రాంగోపాల్ వర్మ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది ఎంత రిస్క్ అని అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ఇదే ట్విట్టర్ వేదికగా ఆమెకు క్షమాపణలు కూడా తెలియజేశారు. మొదట పంచుకున్న ట్విట్టర్లో వర్మ.. ప్రస్తుతం ఆమె ఎలా ఉంది అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. ఆమె ఫొటో షేర్ చేస్తూ," శివ సినిమాలోని ఐకానిక్ సైకిల్ చేజ్ సన్నివేశంలో కనిపించిన అమ్మాయి పేరు సుష్మ. రిస్కీ షార్ట్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆమె యూఎస్ఏ లో ఏఐ - కాగ్నిటివ్ సైన్స్ లో పరిశోధన చేస్తోంది"అంటూ

అలాగే మరో ట్వీట్ చేస్తూ ఆమెకు క్షమాపణలు కూడా తెలియజేశారు.. సుష్మ.. నువ్వు సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావ్. ఆ రిస్కీ షాట్ తో నువ్వు ఎంతగా భయపడ్డావో ఓ దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. అంగీకరించు.." అంటూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టాడు.

ట్విట్టర్ లో వర్మ రీసెంట్ టైమ్స్ లో పోస్టులు చూస్తుంటే ఏదో జ్ఞానోదయం జరిగినట్లు కనిపిస్తుంది. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవికి కూడా ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. గతంలో తాను మెగా ఫ్యామిలీను మెగాస్టార్ ని విమర్శించినందుకు రియలైజేషన్ వచ్చినట్లు ట్వీట్ చేశాడు.

ఇప్పుడు తాజాగా సుష్మాకు సారీ చెప్పాడు. అలానే రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ కూడా నాగార్జున ఒకవేళ సినిమా చేయడానికి ఒప్పుకున్న కూడా నేను చేయను. నేను సక్సెస్ ఫుల్ సినిమా చేసిన తర్వాతే నాతో సినిమా చేయమని అడుగుతాను అని చెప్పడం మొదలుపెట్టాడు. శివ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాకి ఇప్పుడు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.




Tags:    

Similar News