ఉపాసన 'డబుల్' సెలబ్రేషన్స్.. అల్లు వారంతా ఎక్కడ?
ఉపాసన సీమంతం వేడుక ఎంతో ఘనంగా జరగ్గా.. మెగా కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు.;
మెగా స్టార్ కపుల్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకలు ఇటీవల నిర్వహించారు. ఆ వీడియోను ఉపాసన ఇటీవల షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఉపాసన సీమంతం వేడుక ఎంతో ఘనంగా జరగ్గా.. మెగా కుటుంబసభ్యులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సందడి చేశారు. హీరో వెంకటేష్ తన సతీమణితో హాజరవ్వగా.. మరో హీరో నాగార్జున కూడా తన ఫ్యామిలీతో వచ్చారు. వీరితో పాటు కోలీవుడ్ హీరోయిన్ నయనతార తన భర్త, పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు.
మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నాగబాబు, వైష్ణవ్ తేజ్, పవన్ సతీమణి అన్నా లెజనోవా సహా పలువురు అటెండ్ అయ్యారు. కానీ అల్లు కుటుంబం నుంచి కూడా ఒక్కరు కూడా కనిపించలేదు. అల్లు అరవింద్, ఆయన సతీమణి, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లల్లో ఒక్కరూ ఉపాసన బేబీ షవర్ గ్లింప్స్ లో లేరు.
దీంతో మళ్లీ ఏం జరిగిందోనని కొందరు సినీ ప్రియులు, నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం రెండు కుటుంబాల మధ్య వైరం ఉందని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని పరోక్షంగా చాటిచెప్పారు. కానీ ఇప్పుడు ఉపాసన బేబీ షవర్ వీడియోలో ఒక్క అల్లు ఫ్యామిలీ మెంబర్ లేకపోవడంతో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇటీవల దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి కనక రత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం.. సంవత్సరం వరకు శుభకార్యాలకు హాజరు కాకూడదని చాలా మంది నమ్ముతారు. అందుకే అల్లు కుటుంబసభ్యులు సీమంతానికి రాలేదమోనని కొందరు నెటిజన్లు అంటున్నారు.
కానీ ఇంకొందరు మాత్రం.. అదే కారణం అనుకుంటే.. ఇటీవల మెగా డాటర్ సుస్మిత తన నివాసంలో దుర్గా పూజ చేయగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు అటెండ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తల్లి మరణించిన కొన్ని రోజులకే దసరా రాగా.. వారంతా సుస్మిత ఇంట జరిగిన పూజకు హాజరయ్యారు. కాబట్టి ఇప్పుడు గైర్హాజరుకు మరేదైనా కారణం ఉండొచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఉపాసన సీమంతానికి ఎందుకు రాలేదో అల్లు, మెగా కుటుంబాలకే తెలియాలి.