RC17పై అంత సస్పెన్స్ ఎందుకు? సుకుమార్ స్ట్రాటజీ ఇదేనా?

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న RC 17 ఒకటి.

Update: 2026-07-18 22:30 GMT

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న RC 17 ఒకటి. ఆ సినిమా ప్రకటించి చాలా కాలమైనా, ఇప్పటివరకు స్టోరీ, రోల్స్, బ్యాక్ డ్రాప్ వంటి అంశాలపై మేకర్స్ పెద్దగా వివరాలు వెల్లడించలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఆ. పరిస్థితిని చూస్తుంటే RC 17 విషయంలో సుకుమార్ మరోసారి తన స్పెషల్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన సమాచారం షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే బయటకు వస్తుంటుంది. క్యాస్టింగ్ లుక్స్, స్టోరీ బ్యాక్ డ్రాప్, సినిమాకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తుంటారు. కానీ RC 17 విషయంలో మాత్రం పరిస్థితి ఇప్పటివరకు భిన్నంగా ఉందనే చెప్పాలి. సినిమా గురించి అధికారికంగా వెల్లడైన సమాచారం చాలా తక్కువే. ఇదే ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

సుకుమార్ కెరీర్‌ ను పరిశీలిస్తే, ఆయన సినిమాల విషయంలో ముందుగానే అన్ని విషయాలు బయటపెట్టడం చాలా అరుదు. ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠను కొనసాగించే విధానాన్నే ఎక్కువగా అనుసరిస్తుంటారు. సినిమా విడుదలకు ముందు వరకు కథకు సంబంధించిన ప్రధాన అంశాలను సీక్రెట్ గానే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఆయన ప్రాజెక్టులు ప్రకటించిన నాటి నుంచే హాట్ టాపిక్ గా మారుతుంటాయి.

RC 17 విషయంలో కూడా అదే తరహా స్ట్రాటజీ కనిపిస్తోందని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ సినిమాపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కథ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? రామ్ చరణ్ పాత్ర ఎలా ఉంటుంది? సుకుమార్ ఈసారి ఎలాంటి కథను సిద్ధం చేశారు? వంటి ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం మేకర్స్ నుంచి ఇంకా బయటకు రాలేదు.

ఆ సస్పెన్స్‌ కు మరో కారణం రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌ పై ఉన్న అంచనాలే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా ఆ చిత్రం సత్తా చాటింది. దీంతో RC 17పై నార్మల్ గానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు కూడా మేకర్స్ సమాచారాన్ని పరిమితంగానే విడుదల చేస్తున్నారని భావిస్తున్నారు.

ఇటీవల విడుదలైన పోస్టర్లు, అఫిషియల్ అప్డేట్లు కూడా సినిమా గురించి పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వకుండా ఆసక్తిని పెంచేలా ఉండటం గమనార్హం. దీంతో అభిమానులు తమదైన అంచనాలు వేస్తూ సోషల్ మీడియాలో చర్చలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా RC17పై కొనసాగుతున్న సస్పెన్స్ యాదృచ్ఛికంగా కనిపించడం లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టి, సినిమా చుట్టూ చర్చ కొనసాగించేలా సుకుమార్ స్పెషల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఆ సస్పెన్స్ కు తెరపడాలంటే మేకర్స్ నుంచి మరిన్ని అప్డేట్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News