చరణ్ × మ్యూజిక్ డైరెక్టర్స్.. ఇది గమనించారా..
రంగస్థలంలో ఫోక్ సౌండ్‌తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత వినయ విధేయ రామలో పూర్తిగా కమర్షియల్ జోన్‌కు వెళ్లాడు. ఆ రెండు సినిమాల తర్వాత మాత్రం దేవిశ్రీ వెంటనే మళ్ళీ చరణ్ సినిమాకు రాలేదు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు అనిరుధ్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌పై టీమ్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే ఈ బజ్‌తో చరణ్ సినిమాల మ్యూజిక్ ట్రాక్ వెనక్కి చూస్తే ఒక మంచి పాయింట్ కనిపిస్తోంది. వినయ విధేయ రామ తర్వాత ఆయన నటించిన ప్రతి సినిమాకు కంపోజర్ మారిపోయాడు.
రంగస్థలం, వినయ విధేయ రామకు వరుసగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు. చరణ్ కెరీర్‌లో రీసెంట్‌గా ఒకే కంపోజర్ బ్యాక్ టు బ్యాక్ రావడం అక్కడే జరిగింది. అంతకుముందు ఎవడు కూడా దేవిశ్రీదే. రంగస్థలంలో ఫోక్ సౌండ్‌తో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన తర్వాత వినయ విధేయ రామలో పూర్తిగా కమర్షియల్ జోన్‌కు వెళ్లాడు. ఆ రెండు సినిమాల తర్వాత మాత్రం దేవిశ్రీ వెంటనే మళ్ళీ చరణ్ సినిమాకు రాలేదు.
ఆర్‌ఆర్‌ఆర్‌కు కీరవాణి, ఆచార్యకు మణిశర్మ, గేమ్ ఛేంజర్‌కు తమన్, పెద్దికి ఏఆర్ రెహమాన్ పని చేశారు. ఇందులో కీరవాణి రాజమౌళి రెగ్యులర్ కంపోజర్. శంకర్ తన తొలి తెలుగు డైరెక్ట్ సినిమాకు తమన్‌ను తీసుకున్నాడు. బుచ్చిబాబు మాత్రం ఉప్పెన తర్వాత చేస్తున్న పెద్ద సినిమా కోసం రెహమాన్‌ను ఎంచుకున్నాడు. దర్శకుడు మారిన ప్రతిసారీ మ్యూజిక్ టీమ్ కూడా కొత్తగా సెట్ అయింది.
చరణ్‌కు వీళ్లలో చాలామందితో పాత కనెక్షన్ ఉంది. చిరుత, రచ్చకు మణిశర్మ పని చేశాడు. మగధీర తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌తో కీరవాణి మళ్లీ వచ్చాడు. నాయక్, బ్రూస్ లీ తర్వాత తమన్ గేమ్ ఛేంజర్‌కు చేరాడు. ధృవకు హిప్ హాప్ తమిళ, గోవిందుడు అందరివాడేలేకు యువన్ శంకర్ రాజా, ఆరెంజ్‌కు హారిస్ జయరాజ్ సంగీతం ఇచ్చారు. అంటే చరణ్ ఫిల్మోగ్రఫీలో ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో రెండు కంటే ఎక్కువ సినిమాలు చేయలేదు.
ఇప్పుడు సుకుమార్ సినిమా దగ్గరే హైప్ మరో లెవెల్లో పెరుగుతోంది. సుకుమార్ అంటే దేవిశ్రీ ప్రసాద్ అనే కాంబినేషన్‌కు రెండు దశాబ్దాల హిస్టరీ ఉంది. ఆర్య నుంచి పుష్ప 2 వరకు ఇద్దరూ కలిసి వచ్చారు. రంగస్థలం కూడా అదే జోడీ నుంచి వచ్చింది. అలాంటి దర్శకుడి తదుపరి చరణ్ సినిమాకు అనిరుధ్ పేరు వినిపించడం వల్లే ఈ బజ్‌కు వెయిట్ వచ్చింది. నిజంగా అనిరుధ్ వస్తే చరణ్‌తో అతనికి ఇదే మొదటి సినిమా అవుతుంది. అనిరుధ్ ప్రస్తుతం తెలుగు, తమిళ స్టార్ సినిమాలతో వరుసగా పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా.
ప్రస్తుతం చరణ్ సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నికల్ టీమ్ పేర్లు ఇంకా బయటకు రావాల్సి ఉంది. మెగా హీరోలలో ఇప్పటివరకు అనిరుధ్ ఎవరితోనూ వర్క్ చేయలేదు. ఈ కాంబో కోసమే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అనిరుధ్ ఎంత బిజీగా ఉన్న న్యూ కాంబినేషన్ లో వర్క్ చేయడానికి రెడీ గా ఉంటాడు. ముఖ్యంగా సుకుమార్ లాంటి డైరెక్టర్ తో చాన్స్ వస్తె అసలు వదులుకోడు. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడూ అఫిషియల్ క్లారిటీ వస్తుందో చూడాలి.