చరణ్ కోసం సీక్రెట్ డైరెక్టర్ ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్లానింగ్‌తో టాలీవుడ్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు. జూన్ 4న 'పెద్ది' సినిమా విడుదల కాబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది.;

Update: 2026-05-03 19:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్లానింగ్‌తో టాలీవుడ్‌ను ఆశ్చర్యపరుస్తున్నారు. జూన్ 4న 'పెద్ది' సినిమా విడుదల కాబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. అయితే దీని తర్వాత సుకుమార్ సినిమా కంటే ముందే చరణ్ ఒక క్విక్ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

ఇప్పటికే చరణ్ దీని కోసం డేట్స్ కూడా కేటాయించారని తెలియడంతో, అసలు ఆ సీక్రెట్ డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఈ మధ్య కాలంలో చాలా మంది కొత్త దర్శకులతో పాటు సీనియర్ దర్శకులు కూడా పనిచేశారు. నాగవంశీ వద్ద ప్రస్తుతం హిట్ ట్రాక్‌లో ఉన్న దర్శకుల లిస్ట్ గట్టిగానే ఉంది. అయితే చరణ్ లాంటి భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఎవరిని సెట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నాగవంశీ ఇప్పటికీ రకరకాల కథలు వింటున్నారా లేక ఇప్పటికే ఒకరిని ఫిక్స్ చేసి రహస్యంగా ఉంచుతున్నారా అన్నది అంతుచిక్కడం లేదు. అయితే గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మీద నాగవంశీకి గట్టి నమ్మకం ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ గౌతమ్ తోనే తన శైలికి భిన్నంగా చరణ్ కోసం ఏదైనా కొత్త స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నారా అనే చర్చ ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. గతంలోనే చరణ్, గౌతమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు.

ఇక ఏడాది క్రితం నాగవంశీ నిర్మాణంలో వచ్చిన 'కింగ్ డమ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఒకవేళ చరణ్ మళ్ళీ గౌతమ్ వైపే మొగ్గు చూపితే అది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే నాగవంశీ ప్లానింగ్ ప్రకారం ఇది చాలా వేగంగా పూర్తి చేసే సినిమా కావాలి. ఎందుకంటే జూన్ నుంచి సుకుమార్ సినిమా (RC17) పనులు కూడా మొదలుకాబోతున్నాయి. ఈ గ్యాప్ లోనే చరణ్ చిన్న సినిమాను కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.

దర్శకుడు ఎవరైనా సరే, సితార సంస్థ నుంచి వచ్చే ఈ అఫీషియల్ అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 2026 సంవత్సరం రామ్ చరణ్ కెరీర్ లో చాలా బిజీగా ఉండబోతోంది. 'పెద్ది' రిజల్ట్ తర్వాత చరణ్ చేయబోయే ఈ క్విక్ ప్రాజెక్ట్ ఆయన ఇమేజ్ కు ఎలా ప్లస్ అవుతుందో చూడాలి. నాగవంశీ తన సీక్రెట్ డైరెక్టర్ పేరును ఎప్పుడు బయటపెడతారో కానీ, ఈ లోపే రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరనేది మరికొన్ని రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.

Tags:    

Similar News