'పెద్ది'లో రామ్ చరణ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది`. బుచ్చిబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది`. బుచ్చిబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్‌గా తొలిసారి చరణ్‌తో జోడీ కడుతోంది. అచ్చియమ్మగా జహ్నవి మేకోవర్ ఇప్పటికే అభిమానుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అచ్చమైన పల్లెపడుచుగా కనిపిస్తూనే గ్లామర్‌తో జాహ్నవీ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. యూత్‌కి అత్యంత ఎట్రాక్ట్ చేసే క్రికెట్, కుస్తీ నేపథ్యంలో సాగే సినిమాగా దీన్ని దర్శకుడు బుచ్చిబాబు తీర్చి దిద్దుతున్నారు.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా ఇతర ప్రధాన పాత్రల్లో జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు, జాన్ విజయ్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. టీజర్‌తో ఆకట్టుకుని అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ రెహమాన్ అందించిన పాటలతో నెట్టింట ట్రెండ్ అవుతూ వైరల్‌గా నిలుస్తున్నాయి. `చికిరి..చికిరి..`, రై రై రారా.. సాంగ్స్ ఇప్పటికే విడుదలైయూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్నీ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించి ఫ్యాన్స్‌ని సర్ ప్రైజ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇప్పటికే విడుదల చేసిన గళ్ల చొక్కా..ముక్కుకి పోగు ధరించి మాసిన గెడ్డంతో కనిపించిన లుక్ ఒకటి కాగా... ఇటీవల ఆరు పలకల దేహంలో లుంగీ బిగించి కుస్తీకి దిగే లుక్ మరొకట. అయితే మూడో గెటప్ మాత్రం చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని, దాన్ని సినిమాలో చూడాల్సిదేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే ఆ లుక్ ఏంటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వరుసగా వాయిదా పడుతున్న ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 25న అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాలోని స్పెషల్ సాంగ్ కారణంగా రిలీజ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్‌గా ఆ సాంగ్ కోసం శృతిహాసన్‌ని ఫైనల్ చేశారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావచ్చిందని తెలిసింది.
ముందు ఈ ప్రత్యేక గీతం కోసం మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే, శ్రీలీల, సమంత, మానస వారణాసి, అయేషా ఖాన్‌లలో ఒకరిని అనుకుంటున్నారని వార్తలు షికారు చేశాయి. ఫైనల్‌గా శృతిహాసన్‌తో టీమ్ ఈ ప్రత్యేక గీతాన్ని పూర్తి చేస్తోంది. మార్చిలో రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీ `ఉస్తాద్ గబ్బర్‌సింగ్` కారణంగా వాయిదా పడింది. ఫైనల్‌గా ఏప్రిల్ 30 రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు జూన్ 25కు రిలీజ్ డేట్ మారింది. ఇదే ఫైనల్ అని తెలుస్తోంది.