పెద్ది ఫస్ట్ సింగిల్ ఆలస్యం.. ఎందుకంటే?
ఈ ఇయర్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ సినిమాతో తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు.;
ఈ ఇయర్ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ సినిమాతో తీవ్ర నిరాశను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పెద్ది
ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా పెద్ది సినిమాను రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. అందులో భాగంగానే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, పెద్ది మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
స్పెషల్ ఎట్రాక్షన్ గా రెహమాన్ మ్యూజిక్
పెద్ది సినిమాకు రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని మేకర్స్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుండగా, ఫస్ట్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నామని మొన్నా మధ్య మేకర్స్ చెప్పారు. దీంతో దసరాకు పెద్ది ఫస్ట్ సింగిల్ వస్తుందని అందరూ అనుకోవడంతో పాటూ వార్తలు కూడా వచ్చాయి. తీరా చూస్తే దసరాకు పెద్ది నుంచి ఎలాంటి సాంగ్ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం, పెద్ది ఫస్ట్ సింగిల్ రెడీగా ఉన్నప్పటికీ పాటను షూట్ చేశాక లిరికల్ వీడియోలో కొన్ని విజువల్స్ ను యాడ్ చేసి ఆ తర్వాతే సాంగ్ ను రిలీజ్ చేద్దామని భావించి పాటను రిలీజ్ చేయలేదని తెలుస్తోంది. పెద్ది నుంచి రానున్న ఫస్ట్ సింగిల్ మంచి లవ్ సాంగ్ అని, రెహమాన్ ఆ సాంగ్ ను చాలా ఫ్రెష్ గా కంపోజ్ చేశారని యూనిట్ సభ్యులంటున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనుండగా, పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.