'పెద్ది' ప్రీ రిలీజ్.. హైప్ డబుల్ అయ్యేలా ప్లాన్?

ముఖ్యంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను భారీ స్థాయిలో నిర్వహించి సినిమాపై ఉన్న హైప్ ను డబుల్ చేసేలా మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.;

Update: 2026-05-07 09:40 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్‌ ను కూడా అదే రేంజ్ లో గ్రాండ్‌ గా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను భారీ స్థాయిలో నిర్వహించి సినిమాపై ఉన్న హైప్ ను డబుల్ చేసేలా మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా సినిమా జూన్ 4న రిలీజ్ కానుండగా.. జూన్ 2న హైదరాబాద్‌ లో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్‌ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటున్నారు. డేట్, వెన్యూ దాదాపు ఫిక్స్ అయ్యాయంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఇక సినిమా గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కావడంతో.. అదే థీమ్‌ ను రిఫ్లెక్ట్ చేసేలా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ను డిజైన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

స్టేజ్ డిజైన్ నుంచి ఎంట్రీల వరకు ప్రతిదీ విలేజ్ స్పోర్ట్స్ కాన్సెప్ట్‌ కు తగ్గట్టుగా ఉండేలా ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారని సమాచారం. అభిమానులకు కొత్త ఎక్స్పీరియన్స్ కలిగించేలా ఆ వేడుకను విజువల్ ఫీస్ట్‌ గా మార్చేందుకు టీమ్ ఏర్పాట్లు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆ భారీ ఈవెంట్‌ కు వేదికగా హైదరాబాద్‌ లోని ఎల్బీ స్టేడియాన్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

గతంలో ఎన్నో సినిమా ఈవెంట్లు, పొలిటికల్ మీటింగ్స్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన ఆ స్టేడియంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో.. పెద్ది టీమ్ కూడా ఇదే వేదికను ఫైనల్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు వేలాదిగా వచ్చే అవకాశం ఉండటంతో పెద్ద వేదిక అవసరమని భావించినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. ఆ ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఆ వేడుకను కేవలం సినిమా ప్రమోషన్ ఈవెంట్ గా కాకుండా.. అభిమానులకు ఓ మెగా సెలబ్రేషన్‌ లా మార్చాలని భావిస్తున్నారట. ఆ ఈవెంట్ ద్వారా సినిమాపై మరింత హైప్ తీసుకురావడమే టార్గెట్ గా పెట్టుకున్నారని సమాచారం.

ఇప్పటికే పెద్ది నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ కు మంచి స్పందన రావడంతో.. సినిమా విడుదలపై కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, రామ్ చరణ్ మాస్ లుక్.. అన్నీ కలిసి సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూవీ టీమ్ ప్రమోషన్స్‌ ను మరింత స్పీడప్ చేస్తుండగా.. ఇప్పుడు అందరి దృష్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ అధికారిక ప్రకటన పైనే నిలిచింది.

Tags:    

Similar News