చరణ్ 'పెద్ది'.. కరెక్ట్ గా యూజ్ చేసుకుంటారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై అంచనాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి.;

Update: 2026-05-06 12:30 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై అంచనాలు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఆ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. విడుదలకు మరో నెల కూడా లేకపోవడంతో.. ఇప్పుడు అందరి ఫోకస్ ప్రమోషన్స్‌ పై పడింది.

ఇప్పటికే మేకర్స్ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్సెస్, పాటలు మంచి హైప్ తెచ్చాయి. ముఖ్యంగా చరణ్ ఇంటెన్స్ లుక్, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దీంతో మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం సాధిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో రిలీజ్ కు ఇంకా ఉన్న మిగిలిన టైమ్‌ ను ఎలా వినియోగించుకుంటారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం స్పెషల్ ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు వస్తున్నట్లు సమాచారం. ముందుగా పవర్‌ ఫుల్ ట్రైలర్‌ ను రిలీజ్ చేసి, సినిమాలోని అసలు ఎమోషన్, చరణ్ రోల్ ఇంటెన్సిటీ ప్రేక్షకులకు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ట్రైలర్‌ తో వచ్చే బజ్‌ ను మరింత పెంచేందుకు మే మూడో వారంలో ఒక మాస్ ఐటమ్ సాంగ్‌ ను విడుదల చేయనున్నారు. ట్రైలర్, ఐటమ్ సాంగ్ కలిసొస్తే సినిమా హైప్ పీక్స్‌ కు చేరుతుందని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రమోషన్స్‌ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఇప్పటికే మీడియాతో మాట్లాడగా, త్వరలో హీరో చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఇంటర్వ్యూల్లో పాల్గొననున్నారని సమాచారం. ముంబై, చెన్నై, కేరళ వంటి పలు నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.

దీంతో అవన్నీ నిజమైతే.. విడుదలకు ఇప్పటి నుంచి మిగిలిన సమయాన్ని టీమ్ సరిగ్గా వినియోగించుకుంటున్నట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు.. ప్రమోషన్స్ తో హైప్ ను ఓ రేంజ్ లో పెంచితే ఓపెనింగ్స్ భారీగా వస్తాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే.. చరణ్ తో పాటు కంప్లీట్ టీమ్ కు మెమోరబుల్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక హీరోయిన్ జాన్వీ కపూర్‌ కు ఇది రెండో తెలుగు సినిమా కావడం విశేషం. దేవర తర్వాత ఆమె చేస్తున్న ప్రాజెక్ట్‌ కావడంతో మంచి ఆసక్తి నెలకొంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమాకు సంగీతం అందిస్తుండటంతో, పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి సతీష్ కిలారు నిర్మిస్తున్న పెద్ది మూవీ కోసం మేకర్స్ ప్లాన్ చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ, కంటెంట్‌ పై ఉన్న నమ్మకం.. ఈ రెండూ కలిసి సినిమాకు మంచి ఓపెనింగ్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు మిగిలింది ఒక్కటే.. ఆ అంచనాలను సినిమా ఎంతవరకు నిలబెడుతుందన్నది. మరి జూన్ 4వ తేదీన పెద్ది మూవీకి ఆడియన్స్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News