గ్లోబల్ స్టార్ ఆ రేంజ్ సౌండ్ చెయ్యాల్సిందే!
`ఆర్ఆర్ఆర్` వంటి పాన్ ఇండియా హిట్ తరువాత అదే స్థాయి హిట్‌ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన చరణ్‌కు `గేమ్ ఛేంజర్` ఓ నైట్‌మేర్‌లా మారి షాక్ ఇచ్చింది.;
రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరడం, గ్లోబల్ స్టార్‌గా మారడం తెలిసిందే. ఈ మూవీతో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న చరణ్ ఆ తరువాత దాన్ని కాపాడుకోవడంలో విఫలం అవుతున్నాడనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. కారణం శంకర్‌తో చేసిన పాన్ ఇండియా మూవీ`గేమ్ ఛేంజర్` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడమే. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అందులో సగాన్ని కూడా రాబట్టలేక తీవ్ర నిరాశకు గురి చేసింది.
`ఆర్ఆర్ఆర్` వంటి పాన్ ఇండియా హిట్ తరువాత అదే స్థాయి హిట్‌ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించిన చరణ్‌కు `గేమ్ ఛేంజర్` ఓ నైట్‌మేర్‌లా మారి షాక్ ఇచ్చింది. మూడేళ్ల శ్రమ కూడా వృధాకావడంతో ఇప్పడు చరణ్ తదుపరి ప్రాజెక్ట్‌ని చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నాడట. అదే `పెద్ది`. `ఉప్పెన` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు దీనికి దర్శకుడు. క్రికెట్ గేమ్ చుట్టూ సాగే పీరియాడిక్ లవ్‌స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీతో ఎలాగైనా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవాలని, `పెద్ది` విజయంతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని చరణ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మీర్జాపూర్ నటుడు దివ్యేందు నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ నటిస్తున్నారు. ఇక అప్పలసూరి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నారు.
రీసెంట్‌గా విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ అందరిని షాక్‌కు గురి చేస్తోంది. గుర్తు పట్టలేని విధంగా జగపతిబాబు మేకోవర్ ఉండటంతో అంతా అవాక్కవుతున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పెద్ది గ్లింప్స్, అందులో చెర్రీ బ్యాటింగ్ చేస్తూ తనదైన మేనరిజంతో ఆడిన షాట్, ఫస్ట్ సింగిల్ చికిరిలో రామ్‌చరణ్ వేసిన స్టెప్స్, రెహమాన్ సంగీతం నెట్టింట ట్రెండ్ అయి సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
2026 మార్చి 27న పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన రేంజ్‌కు తగ్గట్టుగా సౌండ్ చేయాల్సిందేనని అంతా అంటున్నారు. కంటెంట్, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, రెహమాన్, రత్నవేలు, నవీన్ నూలి వంటి టాప్ నాచ్ టెక్నీషియన్స్‌తో చేస్తున్న `పెద్ది`తో ఈ సారి చరణ్ గట్టిగా సౌండ్ చేసి పాన్ ఇండియాకు మించి బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవాల్సిందేనని అంతా అంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతూ చరణ్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.