రాజమౌళి తర్వాత బుచ్చి బాబుకి ఆ ఛాన్స్..!
కథ ప్రకారం అవి కుదరకపోయినా రామ్ చరణ్ మాస్ స్టామినా తెలుసు కాబట్టి ఫ్యాన్స్ మెచ్చేలా ఎలివేషన్స్ కంపల్సరీగా ఉండాలి.;

RRR తర్వాత రామ్ చరణ్ ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాల ఫలితాల గురించి తెలిసిందే. ఐతే ఆచార్య సినిమా కంప్లీట్ వేరే కథతో వచ్చింది. ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ చరణ్ పాత్రని గెస్ట్ రోల్ గా రాస్తే అది కాస్త కాస్త నిడివి ఎక్కువ చేయడం వల్ల సినిమా మీద అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఐతే అసలేమాత్రం అంచనాలను అందుకోలేదు. దిల్ రాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కాగా అది కాస్త తీవ్ర నిరాశపరిచింది.
ఐతే రాజమౌళి RRR సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ ని అద్భుతంగా చూపించాడు. రామరాజుకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎన్టీఆర్ కి ఏమాత్రం తగ్గకుండా చరణ్ చూపించిన అభినయం సూపర్ అనిపించింది. ఐతే రాజమౌళి RRR తర్వాత చరణ్ చేయడానికి రెండు సినిమాలు చేసినా ఆ రెండిటిలో ఇలాంటి ఎలివేషన్స్ లేకుండా చేశారు.
కథ ప్రకారం అవి కుదరకపోయినా రామ్ చరణ్ మాస్ స్టామినా తెలుసు కాబట్టి ఫ్యాన్స్ మెచ్చేలా ఎలివేషన్స్ కంపల్సరీగా ఉండాలి. కానీ అదేది చేయలేదు. అందుకే ఆ బాధ్యత ఇప్పుడు బుచ్చి బాబు తీసుకున్నాడు. పెద్ది సినిమాతో చరణ్ మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు బుచ్చి బాబు. మొదటి సినిమా ఉప్పెనతోనే రికార్డులు సృష్టించిన బుచ్చి బాబు ఈసారి పెద్దితో పాన్ ఇండియాని షేక్ చేయాలని చూస్తున్నాడు.
పెద్దిలో రామ్ చరణ్ మాస్ ట్రీట్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ వైబ్ తెస్తుందని ఫస్ట్ షాట్ టీజర్ తోనే చూపించాడు బుచ్చి బాబు. బుచ్చి బాబు టేకింగ్, చరణ్ మాస్ విధ్వంసం ఇలా రెండి కలిసి పెద్ది సినిమాను మెగా ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఒక స్పెషల్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. చరణ్ తో ఇలాంటి సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవ్వడం గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యి మరీ బుచ్చి బాబు రంగంలోకి దిగుతున్నాడు. మరి బుచ్చి బాబు అనుకున్నట్టుగానే పెద్దిని దుమ్ము దులిపేలా చేస్తాడా లేదా అన్నది చూడాలి. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ చేసిన రెండు సినిమాలు డిజప్పాయింట్ చేయడంతో పెద్దితో ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. బుచ్చి బాబు కూడా మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన అంశాలన్నీ పుష్కలంగా పెడుతున్నట్టు తెలుస్తుంది.