పెద్ది ప్రీ ఇంట‌ర్వెల్ నుంచి నెక్ట్స్ లెవెల్.. వైర‌ల‌వుతున్న దుబాయ్ సెన్సార్ బ‌జ్

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై భారీ అంచ‌నాలున్నాయి.

Update: 2026-05-28 08:10 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా పెద్దిపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు, మాస్ టోన్ ఆడియ‌న్స్ లో భారీ ఆసక్తిని క్రియేట్ చేయగా, ఇప్పుడు దుబాయ్ సెన్సార్ వర్గాల నుంచి వస్తున్న బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ కంటెంట్ విషయంలో టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉందన్న ప్రచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ మొత్తం నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోతుందని, అక్కడి నుంచి ఆడియ‌న్స్ ఎమోషనల్‌గా సినిమాతో కనెక్ట్ అయిపోతారనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నార‌ని, ముఖ్యంగా ఎమోష‌న్స్, గ్రామీణ నేపథ్యంతో వచ్చే కొన్ని సన్నివేశాలు ఆడియ‌న్స్ ను కంటతడి పెట్టిస్తాయని సమాచారం. ఇప్పటివరకు మాస్, యాక్షన్, డ్యాన్స్‌లతో తన మార్క్ చూపించిన చరణ్, ఈసారి ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ యాక్టింగ్ తో మరో కొత్త కోణాన్ని బయటపెడుతున్నార‌ని గట్టి టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్‌తో పాటు ఆఖ‌రి 45 నిమిషాలు థియేటర్లలో ఊహించని స్థాయి హై ఇచ్చేలా ఉంటాయని, అదే సినిమాకు ప్రధాన బల‌మ‌వుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రంగస్థలం తర్వాత చరణ్ నుంచి మరో బలమైన విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఈ బజ్ మరింత ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది.

ఇక డైరెక్ట‌ర్ బుచ్చిబాబు విషయానికొస్తే ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టిన ఆయన, కథలో ఎమోష‌న్స్ ను చాలా బలంగా డిజైన్ చేశార‌ని తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం బుచ్చిబాబు టాలీవుడ్ టాప్ లీగ్ డైరెక్ట‌ర్ల లిస్ట్ లో చేరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో భారీ రేట్లకు రైట్స్ అమ్ముడైన నేపథ్యంలో, బయ్యర్లు సేఫ్ కావాలంటే సినిమా కేవలం హిట్ అవ్వడం సరిపోదని విశ్లేషకులు అంటున్నారు.

దీంతో అసలు సవాల్ ఇప్పుడు కలెక్షన్ల దగ్గరే ఉంది. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం పెద్ది బ్రేక్ ఈవెన్ అవాలంటే దేశవ్యాప్తంగా అసాధారణ స్థాయిలో క‌లెక్ష‌న్లు రాబ‌ట్టాల్సిందే. కొందరు ట్రేడ్ పండితులు అయితే ఈ సినిమా పుష్ప‌2 లేదా దానికంటే ఎక్కువ బాక్సాఫీస్ రన్ సాధిస్తేనే పూర్తి స్థాయిలో లాభాలు కనిపిస్తాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న ఎమోషనల్ బజ్, రామ్ చరణ్‌పై ఉన్న క్రేజ్, పాన్ ఇండియా మార్కెట్, మాస్ ఎలిమెంట్స్.. ఇవ‌న్నీ కలిసి చూస్తే పెద్ది టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మరో పెద్ద సంచలనం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News