'పెద్ది' స్పెషల్ సాంగ్.. చరణ్, శృతి స్టెప్పులు కిక్కిచ్చేలా..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై రోజురోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Update: 2026-05-22 08:27 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై రోజురోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన స్పెషల్ సాంగ్ ప్రోమో ఇప్పుడు అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది.




 


హెల్లల్లలో అంటూ రానున్న స్పెషల్ సాంగ్ కు సంబంధించిన చిన్న ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ తోపాటు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కనిపించడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా వీరిద్దరి డ్యాన్స్ మూవ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మాస్ బీట్‌ కు తగ్గట్టుగా వేసిన స్టెప్పులు పాటపై అంచనాలను మరింత పెంచేశాయి. కంప్లీట్ సాంగ్ మార్చి 23న విడుదల కానుండగా, రేపు భోపాల్‌ లో నిర్వహించనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు.

ఆ పాటకు ప్రముఖ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రెహమాన్ సంగీతం అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అది స్పెషల్ సాంగ్ కావడంతో మరింత హైప్ ఏర్పడింది. ఫోక్ టచ్‌ తో పాటు మాస్ బీట్ కలిసి కంపోజ్ చేసినట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, శృతి గ్లామర్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఇక ఈఆ పాటలో మరో హీరోయిన్ కూడా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఎవరు? ఏ పాత్రలో కనిపిస్తారు? అన్న విషయాలపై మూవీ టీమ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. మ్యూజిక్ ఈవెంట్‌ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే చరణ్- శృతి హాసన్ కాంబినేషన్‌ కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. 2014లో వచ్చిన ఎవడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ముఖ్యంగా పింపుల్ డింపుల్ పాటలో వీరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే పాటలో కనిపించబోతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక పెద్దిలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఆ చిత్రాన్ని వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకున్న పెద్ది ఇప్పుడు స్పెషల్ సాంగ్ తో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చరణ్ మాస్ లుక్, రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు మేకింగ్, కిక్కిచ్చే స్టెప్పులు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. మరి జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అంతా వేచి చూడాలి.




Tags:    

Similar News