పెద్ది.. రెహమాన్ సౌండ్ షురూ!
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి.;
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లోనే కాదు, గ్లోబల్ లెవెల్‌లో కూడా భారీ అంచనాలు రేపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్, ఎమోషన్ మిక్స్ చేసి దర్శకుడు బుచ్చిబాబు సాన తీస్తున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ విభిన్నమైన లుక్‌లో, విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని గ్లింప్స్ తోనే క్లియర్‌గా హింట్ ఇచ్చారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. మాస్ ఎంట్రీ, రస్టిక్ స్టైల్, రామ్ చరణ్ ఎనర్జీ అన్నీ కలిసి ఈ సినిమా మరో లెవెల్‌లో ఉంటుందని అభిమానుల్లో బలమైన నమ్మకం ఏర్పడింది. ఇక లేటెస్ట్ గా మేకర్స్ ఒక ప్రత్యేక ఫోటోను షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు, ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ కలిసి ఉన్నారు.
దీని ద్వారా పెద్ది మ్యూజికల్ జర్నీ మొదలుకాబోతుందని క్లియర్ చేశారు. ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ సంకేతం ఇచ్చారు. ఈ ఫోటోతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇక మైసూర్‌లో భారీ స్థాయిలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. వెయ్యి మంది డ్యాన్సర్లతో షూట్ చేస్తున్న ఈ పాట రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ప్లాన్ అయింది.
ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట మాస్, ఎమోషన్, ఫెస్టివ్ వైబ్ కలిపిన అల్టిమేట్ విజువల్ ఫీస్ట్ అవుతుందని యూనిట్ చెబుతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటను మరింత ఎలివేట్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే వారి లుక్స్, స్క్రీన్ కెమిస్ట్రీపై కూడా ఆసక్తి పెరిగింది. కేవలం మాస్ మాత్రమే కాకుండా, స్పోర్ట్స్ డ్రామాలోని ఎమోషనల్ జర్నీని కూడా హైలైట్ చేయబోతున్న ఈ సినిమా కోసం భారీ స్థాయిలో టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. 2026 మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు స్టోరీ టెల్లింగ్, చరణ్ ఎనర్జీ, విజువల్ గ్రాండియర్ అన్నీ కలిసి పెద్ది సినిమాను మరో లెవెల్‌లోకి తీసుకెళ్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రాబోతుందనే అప్‌డేట్‌తో, మ్యూజికల్ ఫీస్ట్ కోసం అభిమానులు వెయిటింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.