చరణ్ 'పెద్ది'.. సోలోగా సెంచరీ కొడతారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Update: 2026-05-27 15:57 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు. బాక్సాఫీస్ షేక్ చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

నిజానికి మొదట సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని ఇప్పుడు జూన్ 4కి మార్చారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ ను స్పీడప్ చేస్తోంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ, వీజీ చంద్రశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆయన మ్యూజిక్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇక సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి వంటి టెక్నీషియన్లు కూడా ఆ ప్రాజెక్ట్ రేంజ్ ను పెంచుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌ లో చరణ్ లుక్, మాస్ టోన్, ఎమోషనల్ బ్యాక్‌ డ్రాప్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి.

అయితే ఇప్పుడు అందరి దృష్టి పెద్ది తొలి రోజు వసూళ్లపై ఉంది. భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలకు ఓపెనింగ్స్ చాలా కీలకం. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ తో పాటు ఓవర్సీస్‌ లో కూడా మంచి ఓపెనింగ్స్ రావాల్సి ఉంటుంది. అందుకే మేకర్స్ ప్రమోషన్స్‌ ను భారీగా ప్లాన్ చేశారు. కాగా.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో చరణ్ రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ గ్రాస్ అందుకున్న హీరోల జాబితాలో చేరారు.

కానీ ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించడం వల్ల.. ఇప్పుడు పెద్దితో సోలో హీరోగా అదే ఫీట్ సాధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మూవీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే చరణ్‌ కు ఆ మార్క్ అందుకోవడం అసాధ్యం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరల్డ్ వైడ్‌ గా రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ప్రభాస్ టాప్ ప్లేస్ కొనసాగుతున్నారు. ఆయన ఖాతాలో ఇప్పటికే ఆరు సినిమాలు ఉన్నాయి.

ఆ తర్వాత రజినీకాంత్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్, షారుక్ ఖాన్ రెండేసి సినిమాలతో లిస్ట్ లో ఉన్నారు. ఇక అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, యష్, చరణ్ ఒక్కో సినిమాతో ఆ లిస్ట్‌ లో చోటు సంపాదించారు. ఇప్పుడు పెద్దితో చరణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తారా? సోలో హీరోగా రూ.100 కోట్ల ఓపెనింగ్స్ క్లబ్‌ లో మరింత స్ట్రాంగ్ ప్లేస్ సంపాదిస్తారా? అన్నది విడుదల తర్వాత తేలనుంది. అయితే ప్రస్తుతం మాత్రం పెద్ది బాక్సాఫీస్ అంచనాలు భారీగానే ఉన్నాయి.

Tags:    

Similar News