పెద్ది చరణ్.. లోయ దగ్గర రిస్కీ స్టెప్!

తాజాగా అలాంటిదే ఓ వీడియో పెద్ది సినిమా సెట్స్ నుంచి లీక్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అదే మాట అంటున్నారు.;

Update: 2025-10-11 05:57 GMT

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్న పాన్ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాకు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ సినిమాపై ఆయన భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చెర్రీ తన లుక్స్ మార్చేశారు.

మొన్న ఆ మధ్య జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఇందులో ఆయన బీస్ట్ మోడ్ లో కనిపించారు. ప్రొఫెషన్ కోసం ఫుల్ డెడికేషన్ తో పని చేస్తున్నారని నెటిజన్లు ప్రశంసించారు. తాజాగా అలాంటిదే ఓ వీడియో పెద్ది సినిమా సెట్స్ నుంచి లీక్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అదే మాట అంటున్నారు. ఆయన సినిమా కోసం భారీగానే రిస్క్ లు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ వీడియో ఏంటంటే?

ప్రస్తుతం పెద్ది మూవీ షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందులో చెర్రీ డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఓ ఎత్తైన కొండ ప్రాంతంలో పాట షూట్ చేస్తున్నారు. ఇందులో చెర్రీ లోయ పక్కనే ఉన్న ఓ ఎండిపోయిన చెట్టు కొమ్మపై డ్యాన్స్ స్టేప్పులు వేస్తున్నారు. చెట్టు కొమ్మపై ఒక కాలు, మరో కాలు స్లోప్‌ ఉన్న బండరాయిపై ఉంచి బ్యాలెన్స్‌ చేసుకుంటూ స్టెప్పులు వేశారు.

అయితే ఇది చాలా రిస్కీ షాట్. అది వీడియో చూస్తేనే టెన్షన్ గా ఉంటుంది. అలాంటిది చెర్రీ స్వయంగా అలాంటి రిస్క్ కు ఒప్పుకొని చేస్తున్నారు. ఒకవేళ చెట్టు కొమ్మ విరిగినా, అక్కడున్న బండరాయి జారినా పక్కనే లోయలోకి జారే ప్రమాదం ఉంది. అక్కడి లొకేషన్ కూడా ప్రమాదంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం చరణ్ చేస్తున్న సాహసం సగటు సినిమా ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ సీన్ థియేటర్లలో పడినప్పుడు మాత్రం వేరే లెవెల్ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాకు డెడికేషన్ తో పనిచేయడం చెర్రీ తర్వాతే ఎవరైనా అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు షేర్ చేస్తున్నారు. చరణ్ ను రిస్క్ ను కూడా రస్క్ లాగా తీసుకుంటున్నారని మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 మార్చి 26న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News