రామ్ చ‌ర‌ణ్ ర‌ఫ్..ఉపాస‌న సున్నితం!

అయితే ఈ రెండు విరుద్ధ శైలి కలయిక పిల్లల పరిపూర్ణ ఎదుగుదలకు తోడ్పడుతుందని చ‌ర‌ణ్ విశ్వాసం వ్య‌క్తం చేసారు.;

Update: 2026-04-14 04:11 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వెండితెరపైనే కాదు. నిజ జీవితంలోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం - పిల్లల పెంపకం గురించి చేసిన వ్యాఖ్యలు అంద‌రి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద కుమార్తె క్లిన్ కార, శివ‌రామ్, అన్విరా దేవి పిల్లల ఎదుగుదల విషయంలో తాను అనుసరిస్తున్న విధానం గురించి చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పిల్లల పెంపకంలో తనది కాస్త రఫ్ పంథా అని అంటున్నారు. అంటే పిల్లలను అతిగా గారాబం చేయ‌డం న‌చ్చ‌ద‌న్నారు. కట్టడి చేయకుండా వారికి రిస్క్ తీసుకునే స్వేచ్చ‌నివ్వాల‌న్నారు .

`పిల్లలు కింద పడినా? దెబ్బలు తగిలించుకున్నా ? వాటి నుండి వారు పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మ‌నం భయపడితే వారు స్వతంత్రంగా ఎదగలేరన్నారు. పిల్లలు సొంతంగా ప్రపంచాన్ని అన్వేషించే స్వేచ్ఛను ఇవ్వాలన్న‌దే తాను నమ్ముతున్నారు. భార్య ఉపాసన పెంపకం మాత్రం చ‌ర‌ణ్ కి పూర్తి భిన్నంగా ఉంటుంద‌న్నారు. `ఉపాసన పిల్లల పట్ల చాలా సున్నితంగా, ప్రేమగా వ్యవహరిస్తుంది. వారి అవసరాలను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. తండ్రిగా తాను ధైర్యాన్ని నూరిపోస్తుంటే? తల్లిగా ఉపాసన వారికి ఒక భద్రతా వలయంలా నిలుస్తుందని చ‌ర‌ణ్ వివరించారు.

అయితే ఈ రెండు విరుద్ధ శైలి కలయిక పిల్లల పరిపూర్ణ ఎదుగుదలకు తోడ్పడుతుందని చ‌ర‌ణ్ విశ్వాసం వ్య‌క్తం చేసారు. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రు ఒకేలా ఉంటేనే పిల్ల‌ల విష‌యంలో ఆందోళ‌న ప‌డాల్సి ఉంటుంద‌ని..ఒక‌రు ర‌ఫ్ గా..మ‌రొక‌రు సున్నితంగా ఉంటే పిల్ల‌ల‌కు భ‌యంతో పాటు ధైర్యం కూడా క‌లుగుతాయ‌న్నారు. పెద్ద కుమార్తె క్లిన్ కారతో పాటు త‌న‌యుడు శివరామ్ , చిన్న కుమార్తె అన్వీర దేవి పట్ల కూడా చరణ్ ఇదే రకమైన బాధ్యతను ప్రదర్శిస్తున్నారు. మెగా కుటుంబంలోని తదుపరి తరం పిల్లలందరూ క్రమశిక్షణతో పాటు సాహసోపేతమైన మనస్తత్వంతో పెరగాలని కోరుకుంటున్నారు.

స్టార్ హోదాలో కాకుండా బాధ్యతాయుతమైన తండ్రిగా ఆయన చూపిస్తోన్న‌ ఈ పరిణతి మెగా అభిమానులను , సామాన్య ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ మాటలు నేటి తరం తల్లిదండ్రులకు కొత్త ఆలోచనను ఇస్తు న్నాయి. పిల్లలను అతిగా రక్షించడం కంటే? వారిని సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం చేయడమే నిజమైన పెంపకమ‌ని చాటి చెప్పారు. వెండితెరపై మాస్ హీరోగా అలరించే చరణ్ ఇంట్లో మాత్రం పిల్లల భవిష్యత్తు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రాక్టికల్ డాడ్ అని రూపించుకున్నారు. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన `పెద్ది` పాన్ ఇండియాలో రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. `గేమ్ ఛేంజ‌ర్` ప్లాప్ అవ్వ‌డంతో? `పెద్ది` అన్ని లెక్క‌ల్ని స‌రి చేస్తుంద‌ని చ‌ర‌ణ్ కాన్పిడెంట్ గా ఉన్నాడు.

Tags:    

Similar News