పెళ్లి త‌ర్వాతా ర‌కుల్ కెరీర్ ఏం మార్లేదు!

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల‌కు దూర‌మై నాలుగేళ్లవుతుంది. `కొండ‌పొలం` త‌ర్వాత అమ్మ‌డు పూర్తిగా హిందీకే ప‌రిమిత‌మైంది.;

Update: 2025-12-01 01:30 GMT

ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల‌కు దూర‌మై నాలుగేళ్లవుతుంది. `కొండ‌పొలం` త‌ర్వాత అమ్మ‌డు పూర్తిగా హిందీకే ప‌రిమిత‌మైంది. అక్క‌డ అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటుంది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ప్ర‌యాణం సాగిస్తుంది. హిట్లు కంటే ప్లాపు లే ఎక్కువ క‌నిపిస్తున్నాయి. మ‌రి న‌టిగానైనా మార్క్ వేసిందా? అంటే! ఆ రేంజ్ పెర్పార్మెన్స్ ఏ సినిమాలోనూ ఇవ్వ‌లేదు. ఖాళీ లేకుండా సినిమాలు చేస్తుంద‌నే మాట త‌ప్ప‌? అంత‌కు మించి ఇప్ప‌టి వ‌ర‌కూ హిందీలో ర‌కుల్ సాధించింది ఏం లేదు.

స‌క్సెస్ కు ఆమ‌డ దూరంలో:

గ‌త ఏడాది ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. నిర్మాత జాగీభ‌గ్నానీ తో ప్రేమ బంధానికి పుల్ స్టాప్ పెట్టి స్టాప్ పెట్టి ఓ ఇంటిదైంది. సాధార‌ణంగా వివాహ‌మైతే జీవితంలో కొత్త‌గా మార్పులొస్తాయంటారు. కెరీర్ మ‌రింత గొప్ప‌గా మారుతుంద‌ని అంటారు. కానీ ర‌కుల్ విష‌యంలో అలాంటి అద్భుతాలేవి జ‌ర‌గ‌లేదు. కేవ‌లం ఛాన్సులు అందుకోవ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మైంది త‌ప్ప‌! స‌క్సెస్ కు మాత్రం ఇంకా దూరంలోనే ఉంది. 2026 ఫిబ్ర‌వ‌రికి ర‌కుల్ కి పెళ్లై రెండేళ్లు పూర్త‌వుతుంది. మ‌రి ఈ శుభ సంద‌ర్బంలో కొత్త మార్పు ఏదైనా చోటు చేసుకుంటుందేమో చూడాలి.

ఆ సినిమా రిలీజ్ లేన‌ట్లేనా:

కానీ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఏడాది గ్రాఫ్ చూస్తే అవ‌కాశాల ప‌రంగానూ బాగా డౌన్ లో క‌నిపిస్తుంది. ఈ ఏడాది అమ్మ‌డు కేవ‌లం రెండు సినిమాల్లోనే న‌టించింది. `మేరీ హాస్బెండ్ కీ బివీ` అనే చిత్రంలో న‌టించింది. అలాగే దేదే ప్యార్ దే 2 లోనూ న‌టించింది. ఈరెండు ఇప్ప‌టికే రిలీజ్ అయ్యాయి. కానీ వాటి ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచాయి. `ఇండియ‌న్ 3` లోనూ న‌టించింది. కానీ ఆ సినిమా ఇంత వ‌ర‌కూ రిలీజ్ కు నోచుకోలేదు. వాస్త‌వానికి ఏడాది ఆరంభంలోనే రిలీజ్ అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది గానీ కొత్త ఏడాది వ‌స్తున్నా? రిలీజ్ అవ్వ‌లేదు.

2026 లో ర‌కుల్ జోరు త‌గ్గేనా?

దీంతో రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. ద‌ర్శ‌కుడు శంక‌ర్ వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న నేప‌థ్యంలో రిలీజ్ చేస్తే స‌క్సెస్ అవుతుందా? లేదా? అన్న ఆందోళ‌న కూడా నిర్మాత‌ల్ని వెంటాడుతుంది. దీంతో సినిమా ల్యాబ్ కే ప‌రిమిత‌మైంది. ప్ర‌స్తుతం ర‌కుల్ చేతిలో ఉంది ఒకే ఒక్క చిత్రం. అదే `ప‌తీ ప‌త్నీ ఔర్ వాహ్ డూ` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా న‌త్త న‌డ‌క‌న జ‌రుగుతోంది. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి కొత్త ప్రాజెక్ట్ ల సంగ‌తేంటి? అంటే ఆ స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

Tags:    

Similar News