ఒక బాషా.. ఒక కూలీ.. ఒక సైమన్..!

ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఐతే ఈవెంట్ కి రజినీకాంత్ రాలేదు కానీ ఆయన వీడియో మెసేజ్ పంపించారు.;

Update: 2025-08-04 22:30 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే మన కింగ్ నాగార్జున విలన్ రోల్ చేయడమే. లోకేష్ ఏం చెప్పించి ఒప్పించాడో కానీ కూలీ సినిమాలో సైమన్ రోల్ లో నాగార్జున చేశారు.

రజినీకాంత్ వీడియో మెసేజ్..

ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఐతే ఈవెంట్ కి రజినీకాంత్ రాలేదు కానీ ఆయన వీడియో మెసేజ్ పంపించారు. కూలీ సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తుంది. తెలుగులో రాజమౌళి లానే తమిళ్ లో లోకేష్ అన్ని సూపర్ హిట్లు చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. సినిమాలో ప్రత్యేకమైన విషయం నాగార్జున చేయడమే.

ఐదారు నెలలు విలన్ రోల్ కోసం లోకేష్ వెయిట్ చేశాడు. ఒక సర్ ప్రైజ్ విలన్ ఉంటాడని అన్నాడు. నాగార్జునతో 6, 7 సార్లు స్టోరీ సిట్టింగ్స్ వేశాడు. ఫైనల్ గా ఆయన్ను ఒప్పించాడు. సైమన్ రోల్ లో నాగార్జున స్టైల్, యాక్షన్ అదిరిపోతుంది. నాగార్జునతో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పనిచేశా.. ఆయన డైట్, స్కిన్ టోన్, స్టైల్ అన్ని సూపర్ గా ఉంటాయి. థాయ్ లాండ్ లో 18 రోజుల షూట్ లో నాగార్జునతో చాలా టైం గడిపాం. ఆయన ఒక టెరిఫిక్ యాక్టర్.. ఆయన ఇప్పటికీ సూపర్ ఉన్నారు. తాను మాత్రం అలా లేను. ఆయన రోజు జిం, డైట్, 6 అవర్స్ వర్క్ ఇవన్నీ ప్రాపర్ గా చేస్తున్నారని అన్నారు.

గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో కూలీ..

ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి వీళ్లు కూడా బాగా చేశారు. ఆగష్టు 14న తన గోల్డెన్ జూబ్లీ ఇయర్ లో కూలీ సినిమా వస్తుంది. ఈ సినిమాను ఆదరించాలని రజినీకాంత్ అన్నారు. అంతేకాదు సినిమాలో సైమన్ క్యారెక్టర్ చేసిన నాగార్జున పాత్ర అదిరిపోతుందని.. ఒక బాషా.. ఒక ఆంటోని.. ఒక కూలీ.. ఒక సైమన్ అని అన్నారు రజినీకాంత్. అనిరుద్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చాడు. సినిమా చాలా బాగా వచ్చింది. కూలీ సినిమా మీ అందరికీ నచ్చుతుందని అన్నారు రజినీకాంత్.

Tags:    

Similar News