లెజెండరీలతో ఛాన్స్ టాలీవుడ్ కి ఉందా?
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ నాలుగు దశాబ్ధాల అనంతరం భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్-విశ్వనటుడు కమల్ హాసన్ నాలుగు దశాబ్ధాల అనంతరం భారీ మల్టీస్టారర్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఆ లెజెండరీలను డైరెక్టర్ చేసే బాధ్యత లోకేష్ కొనగరాజ్ తీసుకున్నట్లు ప్రకటన అనతరం వైరల్ అవుతోంది. కానీ సంగతేంటంటే? డైరెక్టర్ గా లోకేష్ ఇంకా కన్పమ్ కాలేదు. అదంతా నెట్టింట జరుగుతోన్న ప్రచారం తప్ప! అంతకు మించి ఏం లేదు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కూడా ధృవీకరించారు. తామిద్దరం ఎవరి దర్శకత్వంలో పనిచేస్తామన్నది ఇంకా క్లారిటీ లేదన్నారు.
మెప్పించేది ఎవరవుతారో?
ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథ కుదిరప్పుడు ఆ ద్వయం చేతులు కలుపుతుందని క్లియర్ గా చెప్పేసారు. అయితే ఇద్దరు తమిళ పరిశ్రమకు చెందిన నటులు కావడంతో? అక్కడ దర్శకుల పేర్లే నెట్టింట చర్చకొస్తున్నాయి. వాళ్లకే నక్షత్ర ద్వయం అవకాశం ఇస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆ ఛాన్స్ దేశంలో ఏ డైరెక్టర్ అయినా అందుకోవచ్చు. కమల్-రజనీ ఇమేజ్ కు తగ్గ స్టోరీతో ఎవరైతే మెప్పిస్తారో వారికే అవకాశం కల్పిస్తారు. అలా చూసుకుంటే టాలీవుడ్ ముందంజలో ఉంది. పాన్ ఇండియా వైడ్ సంచలనంమైంది తెలుగు డైరెక్టర్లే.
టాలీవుడ్ కే ఛాన్స్ ఉందా:
రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి సంచలనాలు టాలీవుడ్ కు ఉన్నారు. ఆ ఛాన్స్ వీళ్లలో ఎవరికైనా ఉంది. వారు కాకపోతే మరింత మంది ప్రతిభావంతులు పరిశ్రమలో ఉన్నారు. గణాంకాలప్రకారం చూస్తే? భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులు కూడా తెలుగు వారే. మన వారి సత్తా పాన్ ఇండియాని దాటి గ్లోబల్ స్థాయికి అతి సమీపంలో ఉంది. మంచి కథ రాయాలన్నా? దాన్ని కమర్శిలైజ్ చేయాలన్నా? మార్కెట్ చేయాలన్నా? పబ్లిసిటీలో తెలివైన స్ట్రాటీజీని అనుసరించాలా? అది టాలీవుడ్ కే చెల్లింది.
గోల్డెన్ ఛాన్స్ ఎవరిదో:
ఈ నేపథ్యంలో ఆలెజెండ్స్ తో ఛాన్స్ కు దగ్గరకు ఉన్నది టాలీవుడ్ దర్శకులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ ని కాదని మరొకరకి అవకాశం వచ్చిందంటే? ఆ కథ తెలుగు వారి ప్రతిభను మించి ఉండాలి. ఇద్దర్నీ కథతో ఒప్పించడం అంత సులభం కాదు. ముఖ్యంగా కమల్ హాసన్ అంత ఈజీగా కన్విన్స్ కారు. రైటర్ గా యాన అనుభవం...డైరెక్టర్ గా పనితనం ఇవన్నీ చెక్ చేస్తారు. అంతా ఫిట్ అనుకుంటే? కమల్ మూవ్ అవుతారు. మరి ఆ గోల్డెన్ ఛాన్స్ అందుకునేది ఎవరో చూద్దాం.