'జైలర్ -2' డేట్ లాక్ చేసిన సూపర్ స్టార్!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియాలో ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. `జైలర్` భారీ విజ యం సాధించడంతో రెండవ భాగంగాపై అంచనాలు అంతంతకు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రేక్షకాభిమానులంతా ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదరు చూస్తున్నారు. 'కూలీ' కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడంతో? 'జైలర్ 2' తో ఆలెక్కలన్నీ సరిచేస్తారని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అనూహ్య ప్రకటన ఓ సంచలనంగా:
ఈ నేపథ్యంలో రజనీకాంత్ నోట రిలీజ్ డేట్ రావడం సంచలనంగా మారింది. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేస్తున్నట్లు రజనీకాంత్ కేరళ వెళ్లి తిరుగొస్తున్న సమయంలో ప్రకటించారు. ఇప్పుడీ అనూహ్య ప్రకటన అంతే సంచలనంగా మారింది. సాధారణంగా సినిమా రిలీజ్ తేదీని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుంది. రిలీజ్ తేదీల విషయంలో హీరోలు కల్పించుకోరు. నిర్మాణ సంస్థ చెప్పే వరకూ కూడా హీరో నోరు విప్పరు. ఒకవేళ హీరో లీక్ చేసినా నిర్మాణ సంస్థ చెప్పిన తర్వాతే చెబుతారు. ఈ నేపథ్యంలో రజనీ కేరళ టూర్ రిటర్న్ జర్నీలో చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది రజనీ సొంత ప్రకటనా?
నిర్మాణ సంస్థ చేయాల్సిన పనిని రజనీ చేసారేంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలొస్తున్నాయి. ఓ పెద్ద సినిమా రిలీజ్ తేదీని ఇంత సింపుల్ గా ఎలా ప్రకటిస్తారంటూ మరికొంత మంది వాదనలకు దిగుతున్నారు. ప్రకటన అన్నది ఓ సంచలనంగా ఉండాలి తప్ప ఇంత సింపుల్ గా ఉంటే ఎలా? అంటున్నారు. జూన్ టార్గెట్ గా పెట్టుకుని ప్రకటించిన తేదీ తప్ప ఇది కచ్చితమైన తేదీ కాదని అంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ రజనీకాంత్ కి చెప్పకుండానే ఆయన ఇలా ప్రకటించారా? అంత సాహసం ఆయనెందుకు చేస్తారు? అని మరో వర్గం వాదిస్తోంది.
నిర్మాణ సంస్థ రంగంలోకి దిగాల్సిందే:
మరి ఈ విమర్శ, వ్యతిరేకతకు తెర పడాలంటే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా క్లారిటీ ఇస్తే ఇలాంటి అనవసర చర్చకు తెరపడుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయింది. పెండింగ్ చిత్రీకరన కూడా వీలైనంత త్వరగా ముగించాలని దిలీప్ అండ్ కో నిరంతనం పని చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి మధ్యలో విరామాలు కూడా ఇచ్చారు. కూలీ సినిమాతో పాటు షూటింగ్ జరగడం...ఆ సినిమా రిలీజ్ సమయంలో ప్రచారం కోసం రజనీ కాంత్ బ్రేక్ తీసుకోవడం తెలిసిందే.