అనిరుధ్ వర్క్.. ఆ విషయంలో మాత్రం నో డౌట్!

సినిమాలో హీరో ఎంత బాగా చేసినా.. కొన్ని సీన్లు ప్రేక్షకులకు గుర్తుండి పోవాలంటే మ్యూజిక్ కూడా అంతే బాగుండాలి.

Update: 2026-10-11 18:30 GMT

సినిమాలో హీరో ఎంత బాగా చేసినా.. కొన్ని సీన్లు ప్రేక్షకులకు గుర్తుండిపోవాలంటే మ్యూజిక్ కూడా అంతే బాగుండాలి. ముఖ్యంగా రజనీకాంత్ లాంటి స్టార్ స్క్రీన్ పై కనిపించినప్పుడు ఆ సీన్‌ కు వచ్చే మ్యూజిక్ థియేటర్లలో మరో రేంజ్ హడావుడి తీసుకొస్తుంది. జైలర్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇదే చేసి చూపించారు. ఇప్పుడు జైలర్ 2తో మరోసారి అదే మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

దీంతో ఆ సినిమా విషయంలో అనిరుధ్ వర్క్‌ పై అభిమానుల్లో గట్టి నమ్మకం కనిపిస్తోంది. నిజానికి జైలర్ సినిమా గుర్తొస్తే చాలామందికి రజనీకాంత్ స్టైల్‌ తో పాటు అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా గుర్తుకొస్తుంది. ముఖ్యంగా హుకుమ్ సాంగ్, బీజీఎం థియేటర్లలో అభిమానులను ఊపేశాయి. రజనీకాంత్ స్క్రీన్ పై కనిపించే తీరు, ఆయన వాకింగ్ కు అనిరుధ్ ఇచ్చిన సంగీతం మంచి కిక్ ఇచ్చాయి.

మరోవైపు తమన్నా నటించిన కావాలా పాట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా సాంగ్స్ తోనే కాకుండా, కీలక సీన్స్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అనిరుధ్ సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచారు. ఇప్పుడు జైలర్ 2 విషయంలో కూడా ఇదే అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లో మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటే.. రెండో భాగంలో అంతకంటే బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే మొదటి సినిమాలో హిట్ అయిన పాటల తరహాలోనే మరో సాంగ్ ఇవ్వడం అనిరుధ్‌ కు సరిపోదు. ఈసారి కొత్తగా ఏం చూపిస్తారు, రజనీకాంత్ సీన్లకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడన్నదే అసలు పాయింట్. ఇప్పటికే విడుదలైన పాటలకు వేర్వేరు రెస్పాన్సులు వచ్చాయి. మొదటి పాట అలా బోలెలో అందరినీ ఒకేలా ఆకట్టుకోలేకపోయింది. అయితే ‘వన్ సన్ వన్ మూన్’ పాట మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది.

దీంతో సాంగ్స్ విషయంలో కొంత మిక్స్ డ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై మాత్రం నో డౌట్ అన్న విధంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అనిరుధ్ స్త్రెంత్ కేవలం సాంగ్స్ కే పరిమితం కాదు. హీరో ఎంట్రీ, పోరాట సన్నివేశాలు, విలన్ కనిపించే సీన్లకు తన మ్యూజిత్ తో మరింత స్త్రెంత్ ఇవ్వగలడు. జైలర్ లో ఆ విషయం క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు రెండో భాగంలోనూ రజనీకాంత్‌ కు ఎలాంటి బీజీఎం ఇస్తారు, మొదటి భాగంలో లాగే అభిమానులతో ఈలలు వేయిస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

హుకుమ్ సాంగ్ కు ఇప్పటికే వచ్చిన రెస్పాన్స్ మరోసారి క్యాచ్ చేసుకోవడం నార్మల్ విషయం కాదు. ఆ పాట ఇప్పటికే స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది. దానికి మించిన మాస్ మ్యూజిక్ ఇవ్వాల్సిన బాధ్యత అనిరుధ్‌ పై ఉంది. మరోవైపు స్టోరీలోని కీలక సీన్స్ కు మ్యూజిక్ ఎంత బాగా కుదిరితే సినిమా అంత స్ట్రాంగ్ గా ప్రేక్షకులకు చేరుతుంది. సాంగ్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా.. బీజీఎంతో అదరగొడతారనే అంచనాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారి కూడా తన మ్యూజిక్ తో థియేటర్లలో అదే జోష్ తీసుకొస్తారా అన్నది సినిమా విడుదలయ్యాక చూడాలి.

Tags:    

Similar News