జైలర్ 2 కోసం రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `జైలర్ 2` ఒకటి.
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `జైలర్ 2` ఒకటి. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న భారీ సీక్వెల్‌ను 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొదటి భాగం విజయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ప్రాజెక్ట్‌పై ఎలాంటి రాజీ పడకుండా అద్భుతమైన నిర్మాణ విలువలతో, భారీ స్థాయిలో ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ తీసుకుంటున్న పారితోషికం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నివేదికల ప్రకారం ఈ చిత్రం కోసం రజనీకాంత్ 125 కోట్ల నుంచి 150 కోట్ల వరకు అడ్వాన్స్ గా అందుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు సినిమా సాధించే బాక్సాఫీస్ లాభాల్లో 25% వరకు వాటాను కూడా ఒప్పందంలో భాగంగా పొందేలా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఆశించిన లాభాలు వస్తే రజనీకాంత్ ఈ ఒక్క సినిమా నుంచే మొత్తం 200 కోట్లకు పైగా సంపాదించే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారతీయ సినీ చరిత్రలోనే ఒక నటుడు ఒకే సినిమా ద్వారా అందుకునే అత్యధిక ఆర్జనలలో ఒకటిగా నిలిచే అవకాశముంది.
నెల్సన్ దిలీప్‌కుమార్ కూడా ఈ సీక్వెల్ కోసం భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగం సృష్టించిన సంచలన విజయం తర్వాత నెల్సన్ పారితోషికం 50 కోట్ల నుండి 60 కోట్ల మార్కును తాకిందని టాక్. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సాంకేతిక విభాగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. మొదటి భాగంలో మెరిసిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ లాంటి పలువురు స్టార్ నటులతో పాటు సీక్వెల్‌లో సరికొత్త తారగణం కూడా భాగమైంది.
ఇప్పటికే నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని విడుదలకే సిద్ధమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ , ఓటీటీ డిజిటల్ హక్కుల డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన మొదటి భాగం రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కును చేరుకోవడమే లక్ష్యంగా `జైలర్ 2` బరిలోకి దిగుతోంది. ఆ వసూళ్లు సాధిస్తే కోలీవుడ్ పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదైనట్లే. 1000 కోట్ల వసూళ్ల చిత్రం కోసం పరిశ్రమ సహా ప్రేక్షకులు రెండేళ్లగా ఎదురు చూస్తున్నారు. ఆ కల జైలర్ 2 తో తీరినట్లు అవుతుంది.