హీరోయిన్ రేంజ్ లో రవితేజ కూతురి లుక్.. ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికినట్టేనా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి ఎంత మాట్లాడుకుంటామో, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల గురించిన చర్చ కూడా సోషల్ మీడియాలో అలాగే వైరల్ అవుతోంది.

Update: 2026-10-11 12:36 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాల గురించి ఎంత మాట్లాడుకుంటామో, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల గురించిన చర్చ కూడా సోషల్ మీడియాలో అలాగే వైరల్ అవుతోంది. ఇటీవలే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన అందంతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు సంబంధించిన విశేషాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పూజా కార్యక్రమంలో మోక్షద సందడి:

ఈరోజు (అక్టోబర్ 11న) గ్రాండ్‌గా జరిగిన రవితేజ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో ఆయన కూతురు మోక్షద భూపతిరాజు పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలో నటి అనస్వర రాజన్‌తో ఆమె ఎంతో సరదాగా ముచ్చటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇక ఆ వీడియోలో మోక్షద అందం, హావభావాలు చూసిన నెటిజన్లు అచ్చం టాలీవుడ్ హీరోయిన్‌లాగే ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

నిర్మాణ రంగంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా:

కేవలం ఈవెంట్లలో కనిపించడమే కాకుండా, మోక్షద ఇప్పటికే సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టేశారు. తండ్రి రవితేజ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ తాజా చిత్రానికి కూడా ఆమె నిర్మాణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఇక తెర వెనుక నుండి సినిమాను నడిపిస్తూ తండ్రికి చక్కటి సహకారం అందిస్తున్నారు.

విభిన్న కథాంశంతో 'తులాభారం':

ఈ పూజా కార్యక్రమంలోనే మేకర్స్ సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా రివీల్ చేశారు. రవితేజ మాస్ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ చిత్రానికి ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పొలిటికల్ టచ్, క్రైమ్ కామెడీతో పాటు లవ్‌స్టోరీ కూడా ఉండబోతున్నట్లు టైటిల్ డాక్యుమెంటరీ ద్వారా తెలిపారు.

భారీ తారాగణంతో క్రేజీ ప్రాజెక్ట్:

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంకా మోహన్, అనస్వర రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు టాలెంటెడ్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించనుండగా, దర్శకుడు కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో అలరించనున్నారు. ఈఇక సినిమాతో పాటు రవితేజ కూతురు మోక్షద అందం, టాలెంట్ గురించిన చర్చ కూడా ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. త్వరలోనే ఆమె కెరీర్ గురించి మరిన్ని విశేషాలు తెలిసే అవకాశం ఉంది.

ఇక మొత్తానికి, మాస్ మహారాజా రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు తన స్టైలిష్ లుక్స్‌తో కెమెరా ముందుకు రావడం, నిర్మాణ రంగంలో తన ప్రతిభను చాటుకోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.భవిష్యత్తులో ఆమె నటిగా ఎంట్రీ ఇస్తారా? లేక నిర్మాణ రంగంలోనే కొనసాగుతారా? అనేది చూడాలి.




Tags:    

Similar News