పవర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్ వచ్చే ఏడాదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్త సినిమా అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. `ఓజీ 2` ఎప్పుడు మొదలవుతుంది? ఇంకా ఎలాంటి కొత్త కథలకు కమిట్ అయ్యారు? వాటి దర్శకలు ఎవరు? ఇలా ఎన్నో అంశాలపై పీకే క్లారిటీ ఇస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ అప్ డేట్ ఇప్పట్లో వచ్చే లా కనిపించలేదు. ప్రస్తుతం పవన్ పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉండటంతో పవన్ కళ్యాణ్ ఏ కొత్త సినిమాను ప్రారంభించినా అది వచ్చే ఏడాదే ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రజా సేవకే తొలి ప్రాధాన్యమిస్తూ రాజకీయ షెడ్యూళ్లకు అనుగుణంగానే పీకే ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేసుకోవాలనే యోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో వేడెక్కింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై, ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేయడంపై పూర్తి దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, నాయకులతో సమావేశాలతో ఆయన షెడ్యూల్ అత్యంత బిజీగా మారింది. దీంతో ప్రస్తుతానికి కొత్త సినిమాల షూటింగ్‌లకు లేదా ప్రారంభోత్సవాలకు సమయం కేటాయించడం కష్టంగా మారింది.
ఇప్పటికే దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం `OG` సీక్వెల్ అయిన `OG2`' అధికారికంగా ఖరారైన సంగతి తెలిసిందే. మొదటి భాగంపై ఉన్న అంచనాల నేపథ్యంలో సీక్వెల్‌కు సంబంధిం చిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలన్నా? పవన్ సెట్స్‌లో అడుగుపెట్టాలన్నా? వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనని పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.
అలాగే పవన్ కళ్యాణ్ మరికొంతమంది దర్శకులు వినిపించిన పలు విభిన్నమైన కథలను కూడా విన్నారని తెలుస్తోంది. వాటిలో రెండు కథలు ఆయనకు బాగా నచ్చాయని.. అయితే వాటికి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల విషయంలో సమగ్రమైన చర్చలు జరిపి, సరైన ముహూర్తంలో అధికారిక ప్రకటనలు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే.. ఆరాధించే అభిమానుల కోసం సినిమాలను కూడా సమన్వయం చేసుకో వడం పవన్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రజాసేవను, సినిమాలను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు. ఈసారి కూడా స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం దృష్టిని కొత్త ప్రాజెక్ట్‌లపై మళ్లీంచి బ్యాక్ టూ బ్యాక్-షూటింగ్‌లలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నారు.