రామాయణ రిలీజ్ డేట్.. పెర్ఫెక్ట్ ప్లాన్ ఇది!

రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2026-10-11 16:17 GMT

పెద్ద సినిమా తీస్తే సరిపోదు.. దాన్ని సరైన సమయంలో విడుదల చేయడం కూడా చాలా ముఖ్యం. అందులోనూ భారీ అంచనాలు ఉన్న సినిమాలకు పండుగ సెలవులు కలిసొస్తే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రామాయణ మూవీ టీమ్ కూడా ఇదే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.




 


రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ డేట్ ను నవంబర్ 5గా ప్రకటిస్తూ మూవీ టీమ్ కొత్త పోస్టర్‌ రిలీజ్ చేసింది. నవరాత్రుల మొదటి రోజున ఆ అనౌన్స్మెంట్ చేయడం స్పెషల్ గా నిలిచింది. ఇది రాముడి యుగానికి ఆరంభం అనే మెసేజ్ తో సినిమా జర్నీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దసరా నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు.

అయితే సినిమా రిలీజ్ డేట్ ను చూస్తే ఇంట్రెస్టింగ్ విషయం కనిపిస్తోంది. నవంబర్ 5 గురువారం వస్తోంది. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు వరుసగా ఉన్నాయి. ముఖ్యంగా నవంబర్ 8న దీపావళి పండుగ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. అంటే గురువారం సినిమా విడుదలైతే మొదటి నాలుగు రోజులు ప్రేక్షకులకు సినిమాను చూసే అవకాశం ఉంటుంది. దీపావళి సెలవుల ఎఫెక్ట్ కూడా వసూళ్లపై కనిపించే అవకాశం ఉంది.

సాధారణంగా పెద్ద సినిమాలకు మొదటి రోజు వసూళ్లు ఎంత ముఖ్యమో, ఆ తర్వాత వచ్చే రోజుల్లో ప్రేక్షకుల రెస్పరాన్స్ కూడా అంతే ముఖ్యం. అయితే పండుగ సమయంలో సెలవులు కలిసొస్తే కుటుంబాలతో కలిసి సినిమాలకు వెళ్లేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రామాయణ లాంటి కథకు అన్ని వయసుల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటుంది. దీంతో పండుగ సమయంలో విడుదల చేయడం మూవీ టీమ్ కు మంచి ఛాన్స్!

అంతేకాదు, నవంబర్ 5 నుంచి దీపావళి వరకు ఉన్న సమయాన్ని సినిమా ప్రమోషన్స్ కు మంచిగా యూజ్ చేసుకోవచ్చు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ వంటి నటులు లీడ్ రోల్స్ కనిపిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇప్పుడు విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమా కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న వారికి క్లారిటీ వచ్చింది.

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను రెండు పార్టులుగా రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌ కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగాన్ని 2026 నవంబర్ 5న విడుదల చేయనుండగా, రెండో భాగాన్ని 2027 దీపావళికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఆ సినిమా విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా ఎలాంటి హిట్ అవుతుందో... మూవీ టీమ్ ప్లాన్ ఎంతవరకు పనిచేస్తుంది, సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది అనేది మాత్రం విడుదల తర్వాతే తెలుస్తుంది.

Tags:    

Similar News